bredcrumb

Allu Sirish–Nayanika Reddy Wedding: గ్రాండ్ గా శిరీష్ వెడ్డింగ్.. పెళ్లిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్

By Rajesh Karampoori
| Published: Saturday, March 7, 2026, 10:24 [IST]

Allu Sirish–Nayanika Reddy Wedding: అల్లు అరవింద్‌ చిన్న కొడుకు శిరీష్‌ ఓ ఇంటివాడయ్యారు. ఆయన ప్రేయసి నయనికతో వివాహ బంధంలో అడుగుపెట్టారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ కొల్లూరులో వైభంగా శిరీష్ - నయనికల పెళ్లి జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అల్లు శిరీష్ పెళ్లి ఫోటోలపై ఓ లుక్కేయండి!

Allu Sirish–Nayanika Reddy Wedding
1/7

టాలీవుడ్‌లో అల్లువారింట పెళ్లి బాజాలు మోగాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చిన్న కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ తమ్ముడు అయిన అల్లు శిరీష్ (Allu Sirish) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రేయసి నయనిక రెడ్డిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. శుక్రవారం (మార్చి 6) రాత్రి హైదరాబాద్ లోని కొల్లూరులో ఈ వివాహం వైభవంగా జరిగింది.

Allu Sirish–Nayanika Reddy Wedding
2/7

ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా ఈ వివాహం జరిగింది. తెలుగు సాంప్రదాయాల ప్రకారం జరిగిన పెళ్లి వేడుకలో శిరీష్ నయనిక మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు వేసి జీవితాంతం కలిసి ఉండేందుకు ప్రమాణం చేశారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Allu Sirish–Nayanika Reddy Wedding
3/7

ఈ వివాహ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ తో కలిసి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అదేవిధంగా రామ్ చరణ్- ఉపాసనదంపతులు, సాయి ధరమ్ తేజ, వైష్ణవ్ తేజ, సుస్మిత తదితరులు మెగా కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు.

Allu Sirish–Nayanika Reddy Wedding
4/7

ఈ వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రత్యేకంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్(Allu Arjun) స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని స్వాగతించి ఆప్యాయంగా పలకరించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని కొంతసేపు ముచ్చటించారు.

Allu Sirish–Nayanika Reddy Wedding
5/7

అల్లు శిరీష్ – నయనిక కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. సినీ వర్గాలకు దగ్గరగా ఉండే నయనిక రెడ్డి, హీరో నితిన్ భార్య  శాలిని కందుకూరికి అత్యంత సన్నిహిత స్నేహితురాలు.

Allu Sirish–Nayanika Reddy Wedding
6/7

అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. సినీ రంగం నుంచి సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ దంపతులు, తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీ, హీరోయిన్ రాశీ ఖన్నా  తదితరులు కూడా ఈ వేడుకలో పాల్గొని కొత్త జంటకు ఆశీర్వాదాలు అందించారు.

Allu Sirish–Nayanika Reddy Wedding
7/7

వరుణ్ తేజ- లావణ్య త్రిపాఠి  పెళ్లి సందర్భంగా నితిన్ ఇచ్చిన ఒక ప్రైవేట్ పార్టీలో శిరీష్, నయనిక తొలిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి, తర్వాత ప్రేమగా మారింది. కొంతకాలం పాటు ఒకరినొకరు అర్థం చేసుకున్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

X