bredcrumb

Allu Sirish- Nayanika Wedding: అల్లు శిరీష్- నయనిక పెళ్లి.. అల్లు వారి హల్దీ సెలబ్రేషన్స్ చూశారా?

By Siva Kodati
| Published: Monday, February 23, 2026, 12:02 [IST]

అల్లు శిరీష్ – నయనిక రెడ్డి వివాహం మార్చి 6న హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ నివాసంలో పసుపు దంచే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Allu Sirish haldi celebrations
1/6

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్‌- నయనికల వివాహం మార్చి 6వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. తెలుగు సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు వీరి వివాహానికి తరలిరానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. 

Allu Sirish haldi celebrations
2/6

ఫిబ్రవరి 13వ తేదీన అల్లు అరవింద్ కుటుంబం అధికారికంగా పెళ్లి పనులు ప్రారంభించింది. ఈ మేరకు అల్లు అరవింద్ నివాసంలో పసుపు దంచే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ దంపతులు, శిరీష్, చిరంజీవి సతీమణి సురేఖ, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజినోవా, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని, చిరంజీవి కుమార్తె సుస్మితతో పాటు పలువురు బంధువులు, సన్నిహితులు సందడి చేశారు. 

Allu Sirish haldi celebrations
3/6

అల్లు అరవింద్ ఇంట్లో హల్దీ వేడుకలకు సంబంధించి ఓ వీడియోను శిరీష్ షేర్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ వేడుక ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా పసుపు దంచే కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Allu Sirish haldi celebrations
4/6

నయనిక రెడ్డి హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన యువతిగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. వీరి ఫ్యామిలీకి రియల్ ఎస్టేట్‌తో పాటు పలు బిజినెస్‌లు ఉన్నాయని.. హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

Allu Sirish haldi celebrations
5/6

2023లో టాలీవుడ్ హీరో నితిన్ ఆయన సతీమణి శాలిని దంపతులు ఏర్పాటు చేసిన ఓ పార్టీలో తొలిసారిగా నయనిక రెడ్డి- శిరీష్‌లు కలుసుకున్నారు. వీరి పరిచయం ప్రేమగా మారి కొన్నాళ్లు డేటింగ్ చేశారు. అనంతరం తమ ప్రేమను పెద్దలకు తెలియజేయగా వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. 

Allu Sirish haldi celebrations
6/6

తన తాత, దిగ్గజ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా గతేడాది అక్టోబర్ 1న.. నయనికను పెళ్లాడనున్నట్లు అల్లు శిరీష్ అధికారికంగా ప్రకటించారు. అదే నెలలో వీరి నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. అనంతరం మార్చి 6వ తేదిన నయనిక- అల్లు శిరీష్‌ల వివాహం హైదరాబాద్‌లో నిర్వహిస్తామని ఇరు కుటుంబాలు ప్రకటించాయి. పెళ్లి రోజు దగ్గర పడిపోతుండటంతో కొద్దిరోజుల క్రితం దుబాయ్‌లో అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+