bredcrumb

అల్లు శిరీష్ - నైనిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్... బ్యాచిలర్ పార్టీలో అల్లు అర్జున్, స్నేహ సందడి

By Siva Kodati
| Published: Sunday, February 1, 2026, 17:05 [IST]

అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్-నైనిక పెళ్లికి ముందు దుబాయ్‌లో ఘనంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Allu Sirish- Nayanika
1/8

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కానున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు నయనికతో గతేడాది ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు శిరీష్. ఈ ఏడాది మార్చిలో అల్లు శిరీష్ - నయనికల వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. 

Allu Sirish- Nayanika
2/8

దుబాయ్‌లో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్ - స్నేహారెడ్డి, అల్లు బాబీ.. ఇరు కుటుంబాలు, వారి స్నేహితులు హాజరయ్యారు. నగరంలోని జే 1 బీచ్ ప్రాంతంలో సముద్రంలోని ఓ బోటులో ఈ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ షాంపైన్ బాటిల్ ఓపెన్ చేసి స్ప్రే చేయగా.. అతిథులు కేరింతలు కొడుతూ, గోల గోల చేశారు. 

Allu Sirish- Nayanika
3/8

ఇక ఎప్పటిలాగే అల్లు అర్జున్ - స్నేహారెడ్డి దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అల్లు అర్జున్ వెర్సాస్ ప్రింటెడ్ సిల్స్ షర్ట్‌లో మెరిసిపోయారు. దీని గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దానికి కారణం ఈ షర్ట్ ధర. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ షర్ట్ ధర 1,39,600 రూపాయలు కావడంతో అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదే పార్టీలో స్నేహారెడ్డి వైల్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయారు. 

Allu Sirish- Nayanika
4/8

ఇక అల్లు శిరీష్ - నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. ఆ రోజుకు ఎన్నో స్పెషాలిటీలు ఉన్నాయి. దిగ్గజ హాస్యనటుడు, అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య జయంతి ఆరోజు కావడం విశేషం. అదే రోజు అల్లు అర్జున్ - స్నేహారెడ్డిలు కూడా పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆ రోజే తాను కూడా పెళ్లి చేసుకోవాలని అల్లు శిరీష్‌ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 

Allu Sirish- Nayanika
5/8

అసలు నయనికకు, అల్లు శిరీష్‌కు ఎప్పుడు? ఎక్కడ పరిచయం జరిగింది? ఎలా వారిద్దరూ ప్రేమలో పడ్డారు? అనే చర్చ మళ్లీ మొదలైంది. కొద్దిరోజుల క్రితమే ఈ డిస్కషన్‌కి తెరదించారు అల్లు శిరీష్. 2023 అక్టోబర్‌లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లిలో నయనిక పరిచయమైనట్లు తెలిపారు. 

Allu Sirish- Nayanika
6/8

ఈ పార్టీని నితిన్ - శాలిని కందుకూరి దంపతులు ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు శాలిని.. తన ఫ్రెండ్ అయిన నయనికను కూడా ఇన్వైట్ చేసింది. అప్పుడే మేమిద్దరం తొలిసారిగా కలుసుకున్నాం.. ఆ తర్వాత ప్రేమలో పడి పెళ్లి వరకు చేరుకున్నామని శిరీష్ వెల్లడించారు.

Allu Sirish- Nayanika
7/8

ఇక అల్లు అరవింద్ చిన్న కుమారుడిగా మెగా ఫ్యామిలీ నుంచి అల్లు శిరీష్ కూడా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎంత కష్టపడుతున్నా శిరీష్‌కు బ్రేక్ మాత్రం రావడం లేదు. శిరీష్‌ను నిలబెట్టాలని అల్లు అరవింద్, అల్లు అర్జున్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

Allu Sirish- Nayanika
8/8

గౌరవం, కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు శిరీష్. ప్రస్తుతం ఆయన ఏ కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే పెళ్లి తర్వాత అల్లు శిరీష్ తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. 

X