bredcrumb

Allu Sirish Wedding: అల్లు అర్జున్‌ గ్రాండ్ పార్టీ.. రామ్ చరణ్–ఉపాసన స్పెషల్ అట్రాక్షన్!

By Rajesh Karampoori
| Published: Saturday, February 21, 2026, 11:18 [IST]

Allu Sirish Wedding: అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు షురూ! తమ్ముడి కోసం అల్లు అర్జున్ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయగా రామ్ చరణ్–ఉపాసన స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. అలాగే పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి. 

Allu Sirish Wedding
1/8

అల్లు కుటుంబంలో పెళ్లి సందడి పీక్‌కు చేరింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ (Allu Sirish) తన ప్రేయసి నయనికతో మార్చి 6న వివాహం చేసుకోనున్న నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జోరుగా సాగుతున్నాయి.

Allu Sirish Wedding
2/8

ఇప్పటికే దుబాయ్‌లో ఫ్రెండ్స్‌తో గ్రాండ్ పార్టీ ఇచ్చిన శిరీష్-నయనిక జంట, తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రైవేట్ బాష్‌తో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. పార్టీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

Allu Sirish Wedding
3/8

ఈ పార్టీకి సిద్దూ జొన్నలగడ్డ, తేజా సజ్జా, వైష్ణవ్ తేజ, దేవీ శ్రీ ప్రసాద్, సుశాంత్, క్రుతి శెట్టి, నేహా శెట్టి, రాశి ఖన్నా, నబ్బా నటేష్  తదితరులు హాజరైనట్లు సమాచారం.

Allu Sirish Wedding
4/8

ఇదిలా ఉండగా, శిరీష్-నయనిక పెళ్లి పిలుపులు కూడా మొదలయ్యాయి. తొలి శుభలేఖను మెగా స్టార్ చిరంజీవికి అందించి ఆశీర్వాదం తీసుకున్నారు.

Allu Sirish Wedding
5/8

ఈ క్రమంలో శిరీష్-నయనిక, అల్లు అర్జున్-స్నేహారెడ్డి,  రామ్ చరణ్-ఉపాసన కలిసి దిగిన గ్రూప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ అయ్యప్ప మాలలో కనిపించడంతో ఫ్యాన్స్ ఆ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు.

Allu Sirish Wedding
6/8

అల్లు అర్జున్ పార్టీకి మెగా-అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ముఖ్యంగా రామ్ చరణ్ తన భార్య ఉపానసతో కలిసి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందరూ బ్లాక్ డ్రెస్ కోడ్‌లో మెరిశారు. 

Allu Sirish Wedding
7/8

ఇటీవల పసుపు (పసుపు దంచడం) వేడుక కూడా ఘనంగా జరిగింది. ఈ సంప్రదాయంతో అధికారికంగా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  ఉపాసన ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత తొలిసారి ఈ ఫ్యామిలీ ఫంక్షన్‌లో కనిపించడం మరో హైలైట్‌గా మారింది.

Allu Sirish Wedding
8/8

మొత్తానికి అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు మెగా–అల్లు కుటుంబాన్ని ఒక్కచోట చేర్చాయి. మార్చి 6న జరగనున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశముందని టాక్. అధికారిక వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

X