bredcrumb

కాబోయే భార్యతో బెల్లంకొండ శ్రీనివాస్.. నిశ్చితార్థం ఫోటోలు వైరల్!

By Rajesh Karampoori
| Published: Monday, March 9, 2026, 18:28 [IST]

 టాలీవుడ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ నివాస్(Bellamkond Sreenivas) ఎంగేజ్మెంట్ కావ్య రెడ్డితో జరిగిన విషయం తెలిసిందే. మార్చి 8వ తేదీన వీరి నిశ్చితార్ధ వేడుక బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిగింది. దీనికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఎంతో క్యూట్ గా ఉన్న ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Bellamkonda Sreenivas engagement photos
1/6

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkond Sreenivas) త్వరలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడైన ఈ టాలీవుడ్ యంగ్ హీరో, తన ప్రేయసి కావ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆదివారం (మార్చి 8) హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాదాసీదాగా జరిగినట్లు సమాచారం. ఈ ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bellamkonda Sreenivas engagement photos
2/6

ఈ నిశ్చితార్థ వేడుకలో టాలీవుడ్‌కు చెందిన కొంతమంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త మీనన్ తో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అనిల్ రావిపూడి, విజయ్ కనకమేడల, సాహు గారపాటి, శిరీష్, హర్షితా రెడ్డితోపాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనట్లు సమాచారం.

Bellamkonda Sreenivas engagement photos
3/6

సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోయే యువతి పేరు కావ్య రెడ్డి. ఆమె హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి కాగా, సినీ పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఆమె కుటుంబం న్యాయ వృత్తితో అనుబంధం కలిగి ఉందని, తాతయ్య జడ్జిగా పనిచేయగా తండ్రి లాయర్‌గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

Bellamkonda Sreenivas engagement photos
4/6

కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. అయితే వీరి పెళ్లి తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Bellamkonda Sreenivas engagement photos
5/6

ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లు శ్రీను’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత జయ జనకీ నాయక, రాక్షసుడు వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవల వచ్చిన కిష్కింధపురి సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు.

Bellamkonda Sreenivas engagement photos
6/6

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా 'హైందవ', 'టైసన్ నాయుడు' వంటి ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. త్వరలోనే వివాహం జరగబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

X