bredcrumb

నా అందాలు ప్రదర్శించడానికే.. డింపుల్ హయాతి కొత్త ఆల్బమ్ చూశారా?

By Siva Kodati
| Published: Sunday, February 8, 2026, 22:18 [IST]

భర్త మహాశయులకు విజ్ఞప్తి బ్యూటీ డింపుల్ హయతి లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ఆ ఫోటోలు మీకోసం

Dimple Hayathi Photos
1/5

కెరీర్‌లో బ్రేక్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు కొందరు హీరోయిన్లు. కానీ వారి పోరాటాన్ని మాత్రం ఆపరు. ఈ కోవలోకే వస్తారు డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి.  అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈ ముద్దుగుమ్మ ఇంత వరకు సరైన బ్రేక్ అందుకోలేదు. కానీ అవకాశాల కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు.

Dimple Hayathi Photos
2/5

ఈ అమ్మాయిని నిన్న మొన్నటి వరకు సాదాసీదాగానే కొందరు చూశారు. అయితే డింపుల్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుది కాదు. దర్శకరత్న దాసరి నారాయణ రావుకు ఈమె స్వయానా మనవరాలు. అలనాటి నటి ప్రభ ఈమెకు నాయనమ్మ. ఇంటిలో చాలామంది నటీనటులే. అయినప్పటికీ ఇండస్ట్రీలో ఆమె ప్రయాణం నల్లేరు మీద నడకలా సాగకపోవడం నిజంగా దురదృష్టకర

Dimple Hayathi Photos
3/5

గల్ఫ్ అనే మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన డింపుల్‌కు తొలి సినిమాయే నిరాశపరిచింది. అయితే ఆ తర్వాత గద్దలకొండ గణేష్ చిత్రం ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇందులో ఐటెం సాంగ్‌లో తనలోని డ్యాన్సింగ్ స్కిల్స్‌ను చూపించడంతో పాటు తన అందాలతో కుర్రాళ్లకు సెగలు రేపారు డింపుల్ హయాతి. 

Dimple Hayathi Photos
4/5

ఇటీవల మాస్ మహారాజా రవితేజతో జంటగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతికి విడుదలైంది. అందం, అభినయం పరంగా ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పాస్‌ మార్క్‌లు వేయించుకున్నప్పటికీ ఇంకా మెరుగైన రిజల్ట్ రావాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

Dimple Hayathi Photos
5/5

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే డింపుల్ హయాతి ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలు, ఇతర అంశాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా తన కొత్త ఫోటో షూట్‌కు సంబంధించిన ఆల్బమ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు డింపుల్. మీరు మొత్తం ఆల్బమ్‌ను పూర్తి చేసినప్పుడు.. మీరు ఏం చేస్తారు? వాటన్నింటినీ ప్రదర్శిస్తారని రాసుకొచ్చింది. 

X