bredcrumb

BMW Total Collections: భర్త మహాశయులకు విజ్ఞప్తి టోటల్ కలెక్షన్స్.. రవితేజ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?

By Siva Kodati
| Published: Tuesday, March 10, 2026, 19:57 [IST]

మాస్ మహారాజా రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ నటించిన మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. జనవరి 13న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. 

BMW Total Collections
1/6

గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు మాస్ మహారాజా రవితేజ. అన్ని రకాల ఫార్మాట్స్ టచ్ చేసినప్పటికీ ఆయనకు కాలం కలిసిరాలేదు. ఈ నేపథ్యంలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటించిన మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. సంక్రాంతి కానుకగా జనవరి 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? టోటల్ కలెక్షన్స్ ఎంత? భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి లాభమెంత? నష్టమెంత? అనేది పరిశీలిస్తే..

BMW Total Collections
2/6

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో రవితేజ సరసన డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. సునీల్, సత్య, వెన్నెల కిశోర్, సుధాకర, మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరిలియో సంగీత దర్శకత్వం వహించగా..ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా కోసం హీరో రవితేజ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. .

BMW Total Collections
3/6

వరుస డిజాస్టర్ల కారణంగా రవితేజ మార్కెట్‌పై గట్టి దెబ్బ పడింది. దానికి తగినట్లుగానే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్‌ అంతంత మాత్రంగానే జరిగింది.  చివరికి ఓ మాదిరిగానే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రా, నైజాం, సీడెడ్, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్స్ కలిపి ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో రవితేజ మూవీ లాభాల్లోకి రావాలంటే 22 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 44 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ ఈవెన్ నిర్దేశించారు.

BMW Total Collections
4/6

సంక్రాంతి సీజన్ కావడంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ కాస్తో కూస్తో వసూళ్లను రాబట్టింది. తొలిరోజు 2.6 కోట్ల రూపాయలు, రెండో రోజున 2 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.85 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.7 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.4 కోట్ల రూపాయలు, ఏడో రోజున 55 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున 37 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 14 లక్షల రూపాయలు, పదో రోజున 13 లక్షల రూపాయలు రాబట్టింది. 

BMW Total Collections
5/6

తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల రూపాయలు, తమిళనాడులో 14 లక్షల రూపాయలు, కర్ణాటకలో కోటి రూపాయలు, కేరళలో 2 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 2.25 కోట్ల రూపాయలు చొప్పున కలెక్ట్ చేసింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇండియాలో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ 17.20 కోట్ల రూపాయల నెట్.. 20.6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి వరల్డ్ వైడ్‌గా 22 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది. 

BMW Total Collections
6/6

గత చిత్రాలతో పోలిస్తే భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం రవితేజకు కాస్త ఊరటను కలిగించింది. సంక్రాంతికి భారీ సినిమాలు విడుదల కావడంతో రవితేజ సినిమాపై గట్టి ప్రభావం చూపిందని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. మిక్స్‌డ్ టాక్‌కు తోడు భారీ చిత్రాల పోటీ కారణంగా భర్తమహాశయులకు విజ్ఞప్తి మూవీ క్రమంగా కలెక్షన్స్ కోల్పోయింది. థియేట్రికల్ రన్‌ ముగిసేసరికి 60 శాతం మేర రికవరీ సాధించినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేశారు. 22 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్‌కు గాను 12 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన రవితేజ 8 నుంచి 10 కోట్ల రూపాయల రేంజ్‌లో నష్టాలను మిగిల్చాడు. అయితే శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, మ్యూజిక్, డబ్బింగ్ రైట్స్ ద్వారా నిర్మాత కొంతమేర సేఫ్‌ జోన్‌లోకి రావొచ్చని భావిస్తున్నారు.

X