bredcrumb

జిమ్ డ్రెస్‌లో బిగ్ బాస్ బ్యూటీ...కుర్రాళ్ల మనసు లాగేస్తున్న పింకీ..

By Rajesh Karampoori
| Published: Wednesday, December 24, 2025, 20:47 [IST]

Bigg Boss Priyanka Singh: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 బ్యూటీ ప్రియాంక సింగ్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె బోల్డ్ లుక్, కాన్ఫిడెన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Bigg Boss Priyanka Singh
1/6

Bigg Boss Priyanka Singh: బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 5లో పాల్గొని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కంటెస్టెంట్ ప్రియాంక సింగ్. ట్రాన్స్‌జెండర్‌గా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి ఏకంగా 11 వారాలు కొనసాగడం ద్వారా ఆమె చరిత్ర సృష్టించారు. అన్ని భాషల బిగ్‌బాస్ సీజన్లను కలిపి చూస్తే, ఇంతకాలం హౌస్‌లో నిలిచిన ఏకైక ట్రాన్స్‌జెండర్ కంటెస్టెంట్‌గా ప్రియాంక సింగ్ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు.

Bigg Boss Priyanka Singh
2/6

ప్రియాంక సింగ్ అసలు పేరు సాయి తేజ్. 1995లో జన్మించిన ఆమెకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంత బలంగా లేకపోయినా, చిన్నప్పటి నుంచే బాధ్యతలు మోస్తూ ఎదిగారు. తండ్రి ల్యాబ్ అటెండర్‌గా పనిచేసేవారు. చిన్న వయసులోనే తన గుర్తింపు గురించి స్పష్టత పొందిన ప్రియాంక, సర్జరీల ద్వారా సాయి తేజ్ నుంచి ప్రియాంక సింగ్‌గా మారారు.

Bigg Boss Priyanka Singh
3/6

బిగ్‌బాస్ హౌస్‌లో ప్రియాంక ఆటకు మానస్‌తో ఏర్పడిన అనుబంధం పెద్ద చర్చకు దారి తీసింది. మానస్ ప్రేమ లేదని స్పష్టంగా చెప్పినా, ప్రియాంక అతని వెనకపడటం ఆమె గేమ్‌పై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు భావించారు. ఇదే కారణంగా ఆమెకు కొన్ని సందర్భాల్లో నెగటివ్ ఇమేజ్ ఏర్పడిందని కూడా చెప్పుకున్నారు.

Bigg Boss Priyanka Singh
4/6

బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్లాగ్స్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూనే, ఇతర సెలబ్రిటీల మాదిరిగా బాడీ ఎక్స్‌పోజింగ్‌పై కాకుండా డీసెంట్ లుక్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్టైల్‌ను కొనసాగించారు.

Bigg Boss Priyanka Singh
5/6

ప్రియాంకకు అసలు గుర్తింపు ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారానే వచ్చింది. లేడీ గెటప్స్‌లో ఆమె చూపించిన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత టిక్‌టాక్ ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించారు. ఈ క్రేజ్‌తో నారా రోహిత్ హీరోగా నటించిన ‘బాలకృష్ణుడు’, ‘మనసైనోడు’ వంటి సినిమాల్లో కూడా నటించే అవకాశాలు దక్కాయి.

Bigg Boss Priyanka Singh
6/6

తాజాగా ప్రియాంక సింగ్ జిమ్ డ్రెస్‌లో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట సంచలనం సృష్టించాయి. థై స్లిట్‌తో కూడిన బోల్డ్ లుక్‌లో కనిపించిన ఆమెను చూసి అభిమానులు “మైండ్ బ్లోయింగ్” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో మరోసారి ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+