bredcrumb

Virosh Haldi Event: వెడ్డింగ్ ఆఫ్ విరోష్.. విజయ్ - రష్మికల హల్దీ ఈవెంట్ ఫోటోలు చూశారా?

By Siva Kodati
| Published: Monday, March 16, 2026, 22:46 [IST]

ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నల వివాహం ఘనంగా జరిగింది. దీనిలో భాగంగా హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను విరోష్ జోడీ షేర్ చేసింది

Virosh Haldi Event
1/9

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు వివాహ బంధం ద్వారా ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, కొడవ సాంప్రదాయాల ప్రకారం విజయ్- రష్మికలు ఒకేరోజున రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వివాహం జరిగింది. 

Virosh Haldi Event
2/9

అనంతరం మార్చి 4న సినీ, రాజకీయ, ఇతర ప్రముఖుల కోసం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో భారీ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు విజయ్- రష్మిక. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుంచి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు హాజరయ్యారు. 

Virosh Haldi Event
3/9

ఉదయ్‌పూర్‌లో పెళ్లి తర్వాత తమ వెడ్డింగ్ పిక్స్‌తో పాటు పెళ్లి వేడుకలకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను విజయ్- రష్మికలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను విజయ్ - రష్మికలు షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Virosh Haldi Event
4/9

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు మాత్రం తమ వివాహాన్ని చిరస్మరణీయంగా మార్చాలని అనుకుంటున్నారు. దీనిలో భాగంగా ఇంత వరకు ఏ సెలబ్రిటీ కపుల్ ఆలోచించని విధంగా ప్లాన్ చేసింది ఈ జంట. దేశవ్యాప్తంగా తమ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగేలా చేసింది. మార్చి 1న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫుడ్ అండ్ స్వీట్స్ ట్రక్స్‌తో పాటు ప్రముఖ దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అని విజయ్- రష్మిక.

Virosh Haldi Event
5/9

ఇక ఈ పెళ్లి కోసం రష్మిక- విజయ్‌లు ఎంత ఖర్చుపెట్టారు? హోటల్‌లో వసతి ఏర్పాట్ల నుంచి భోజనాలు, పెళ్లి బట్టలు, నగలు, రవాణా సదుపాయాలు ఇలా ప్రతిదానికి ఎంతైంది? అనే విషయాలు హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్, రష్మికల నగలు, వస్త్రధారణ అచ్చంగా రాజుల కాలం నాటి నగలను పోలి ఉన్నాయి. పట్టు పంచెతో పాటు ఎరుపు రంగు అంగ వస్త్రంతో విజయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

Virosh Haldi Event
6/9

రష్మిక విషయానికి వస్తే.. ఎరుపు రంగు చీరలో, గోల్డ్ బోర్డర్‌తో రూపొందించిన 9 గజాల చీరలో మెరిసిపోయారు. రష్మిక అరవంకీలు, జుంకాలు, జడ బిళ్ల, చెంప సవరాలు, గాజులు, వడ్డాణం, పాపిట బిళ్ల, ముక్కు పుడకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దక్షిణ భారతదేశానికి చెందిన ఓ ప్రఖ్యాత ఆభరణాల సంస్థ వీటిని తయారు చేసింది. వీటి తయారీకి ఏకంగా 10 నెలల సమయం పట్టిందట. విజయ్‌తో పెళ్లి కోసం రష్మిక తన బ్రైడల్ మేకప్ కోసం ఏకంగా రూ.2 కోట్ల వరకు ఖర్చు పెట్టిందనే వార్తలు మరింత సంచలనం సృష్టించాయి.

Virosh Haldi Event
7/9

విజయ్ - రష్మికల మొత్తం పెళ్లి ఖర్చు సుమారు రూ.15 కోట్ల వరకు అయ్యిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. పెళ్లి కోసం దాదాపు 3 కిలోల బంగారం కొనుగోలు చేశారని కూడా ఫిలింనగర్‌లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ వివాహ నిర్వహణ బాధ్యతలను దేశంలోని ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు అప్పగించారని చెబుతున్నారు.

Virosh Haldi Event
8/9

తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత కొత్త జంటతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం ఆనవాయితీ. దీనిలో భాగంగా విజయ్ దేవరకొండ పూర్వీకుల గ్రామం నాగర్ కర్నూల్ జిల్లా బలమూరు మండలం తుమ్మన్‌పేటకు విజయ్- రష్మికలు విచ్చేసి అక్కడి నివాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తులకు తన భార్య రష్మికను పరిచయం చేశారు విజయ్. 

Virosh Haldi Event
9/9

తన తండ్రికి ఊరంటే ఎంతో ఇష్టమని చెప్పిన విజయ్..  గ్రామస్తులందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. అలాగే అచ్చంపేట డివిజన్‌లోని 44 ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 9, 10 తరగతులు చదువుతున్న పిల్లల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో మార్కులు సాధించిన వారికి స్కాలర్‌షిప్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు విజయ్ దేవరకొండ.

X