bredcrumb

The RajaSaab Total Collection: ది రాజాసాబ్ టోటల్ కలెక్షన్స్... ప్రభాస్ మూవీకి నష్టం ఎన్ని కోట్లంటే?

By Siva Kodati
| Published: Sunday, March 8, 2026, 20:51 [IST]

మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ది రాజాసాబ్. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ టోటల్ కలెక్షన్స్ ఎంత? అనేది పరిశీలిస్తే

The RajaSaab Total Collection
1/5

మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ది రాజాసాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌‌లు ప్రభాస్ సరసన హీరోయిన్‌లుగా నటించారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ది రాజాసాబ్‌కు కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా .. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌‌గా పనిచేశారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ది రాజాసాబ్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ప్రభాస్ మూవీ టోటల్ కలెక్షన్స్ ఎంత? అనేది పరిశీలిస్తే. 

The RajaSaab Total Collection
2/5

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ది రాజాసాబ్‌కు 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. నైజాం థియేట్రికల్ రైట్స్ 48 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 78 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో ది రాజాసాబ్ 126 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక,  ఇతర రాష్ట్రాల హక్కులు 16 కోట్ల రూపాయలు, హిందీ థియేట్రికల్ రైట్స్ 35 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 30 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ది రాజాసాబ్ మూవీ వరల్డ్ వైడ్‌గా బిజినెస్ 207 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తద్వారా ది రాజాసాబ్ బ్రేక్ఈవెన్ కావాలంటే 210 కోట్ల రూపాయల షేర్.. 420 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. 

The RajaSaab Total Collection
3/5

ప్రభాస్ మూవీ థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇండియాలో 146.4 కోట్ల రూపాయల నెట్.. 174.14 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్, ఓవర్సీస్‌లో 34.25 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 208.39 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది. తమిళనాడులో 15 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 123 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2.96 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.10 కోట్ల రూపాయలు, కేరళలో 40 లక్షల రూపాయలు, హిందీలో 29.88 కోట్ల రూపాయలు వసూలైనట్లు సాక్‌నిక్ వెల్లడించింది. 

The RajaSaab Total Collection
4/5

ది రాజాసాబ్ మూవీ నైజాంలో 32 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 10 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 10 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 8 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5.5 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 5.5 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 5.4 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 5.5 కోట్లు, నెల్లూరులో 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల రూపాయల నెట్.. 123 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాడు ప్రభాస్. ఏ ఏరియాలోనూ బ్రేక్ఈవెన్ కాకపోగా.. ది రాజాసాబ్ కారణంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ప్రభాస్ ఇమేజ్ కారణంగా ఈ మూవీ 50 శాతం మేర రికవరీ సాధించినట్లు టాలీవుడ్ టాక్. అయితే డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో హక్కుల ద్వారా నిర్మాత కొంత మేర సేఫ్ జోన్‌లోకి వచ్చే అవకాశం ఉంది. 

The RajaSaab Total Collection
5/5

థియేటర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన ది రాజాసాబ్ మూవీ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మార్చి 6వ తేదీ నుంచి హిందీలో ది రాజాసాబ్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయితే ఓటీటీలోనూ ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ లభించలేదు. ఈ సినిమాలోని సీజీ వర్క్, స్క్రీన్ ప్లే, బాడీ డబుల్, గ్రాఫిక్స్‌లపై నెటిజన్లు మీమ్స్‌తో విరుచుకుపడ్డారు. 

X