bredcrumb

MSVPG Total Collections: మన శంకర వరప్రసాద్ గారు టోటల్ కలెక్షన్స్.. చిరంజీవి మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

By Siva Kodati
| Published: Monday, March 9, 2026, 20:06 [IST]

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా.. విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో అలరించారు. ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ ఎంత? చిరంజీవి మూవీకి లాభమెంత? నష్టమెంత?

MSVPG Total Collections:
1/5

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా.. విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మనశంకర వరప్రసాద్ గారు మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? టోటల్ కలెక్షన్స్ ఎంత? చిరంజీవి మూవీకి లాభమెంత? నష్టమెంత?

MSVPG Total Collections:
2/5

కేథరిన్ థ్రెసా, శరత్ సక్సేనా, సచిన్ ఖేడేకర్, జరీనా వహబ్, అభినవ్ గోమటం, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్‌లు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా .. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సాంకేతిక నిపుణులు, నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రోడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి మన శంకర వరప్రసాద్ గారు మూవీని దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. 

MSVPG Total Collections:
3/5

మెగాస్టార్ ఛరిష్మా, అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ కారణంగా మన శంకర వరప్రసాద్ గారు మూవీపై భారీ హైప్ నెలకొంది. దీనికి తగినట్లుగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దుమ్మురేపింది. శంకర వరప్రసాద్ గారు థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... నైజాంలో 31 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 18 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 14 కోట్ల రూపాయలు, తూర్పుగోదావరిలో 9.5 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరిలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 4.25 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయలు చొప్పున బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో 8.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయలు కలిపి వరల్డ్ వైడ్‌గా 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. దాంతో మన శంకర వరప్రసాద్ గారు మూవీ లాభాల్లోకి రావాలంటే 125 కోట్ల రూపాయల షేర్.. 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని బ్రేక్ఈవెన్‌ టార్గెట్‌గా నిర్దేశించారు. 

MSVPG Total Collections:
4/5

మన శంకర వరప్రసాద్ గారు మూవీకి జనవరి 11వ తేదీన ప్రీమియర్స్‌ ప్రదర్శించారు. ప్రీమియర్స్‌లో ఈ మూవీ ఏకంగా 30 కోట్ల రూపాయలు రాబట్టగా.. తొలి వారం 179.15 కోట్ల రూపాయలు, రెండో వారంలో 22.8 కోట్ల రూపాయలు, మూడో వారంలో 8.4 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 218 కోట్ల రూపాయలు.. 258 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. కర్ణాటకలో 22 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 219 కోట్ల రూపాయలు, తమిళనాడులో 3 కోట్ల రూపాయలు, కేరళలో 12 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 4.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇక ఓవర్సీస్‌లో మన శంకర వరప్రసాద్ గారు మూవీకి 43 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది. తెలుగు రాష్ట్రాల్లో మన శంకర వరప్రసాద్ గారు కలెక్సన్స్ పరిశీలిస్తే... ఆంధ్రాలో 117 కోట్ల రూపాయలు, నైజాంలో 65 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 36 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది. చిరంజీవి మూవీ థియేట్రికల్ రన్ ముగిసేసరికి 400 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. 

MSVPG Total Collections:
5/5

మన శంకర వరప్రసాద్ గారు మూవీ డిస్ట్రిబ్యూషన్ షేర్ పరంగా 125 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉండగా 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేసి 80 కోట్ల రూపాయల లాభాలను అందించింది. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ హక్కుల కింద నిర్మాతలకు మెగాస్టార్ మరిన్ని లాభాలను అందించాడు. థియేట్రికల్ రన్ ముగిసిన అనంతరం ఫిబ్రవరి 11న మన శంకర వరప్రసాద్ గారు మూవీ జీ5లో స్ట్రీమింగ్‌లోకి వచ్చి.. ఓటీటీలోనూ టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక మార్చి 2వ తేదీతో చిరంజీవి మూవీ విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తం 109 సెంటర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 97 కేంద్రాల్లో, తెలంగాణలో 5 కేంద్రాల్లో, కర్ణాటకలో 6 కేంద్రాల్లో, ఒరిస్సాలో ఒక సెంటర్‌లో మన శంకర వరప్రసాద్ గారు మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది.

X