bredcrumb

Virosh: రష్మిక- విజయ్ రిసెప్షన్.. చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, బన్నీల సందడి!

By Rajesh Karampoori
| Updated: Thursday, March 5, 2026, 05:50 [IST]

Virosh Wedding Reception Photos:  టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంట వైవాహిక బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరి రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు విరోష్ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. మీరు కూడా ఓ లూక్కేయండి. 

Virosh Wedding Reception Photos
1/10

టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంట వైవాహిక బంధంతో ఒక్కటవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వీరి పెళ్లి వేడుకలు హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ రిసెప్షన్‌తో ముగిశాయి. బుధవారం రాత్రి నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ప్రముఖ హోటల్ తాజ్ కృష్ణలో ఈ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Virosh Wedding Reception Photos
2/10

ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆ వేడుక ఘనంగా జరిగింది. అనంతరం హైదరాబాద్‌లో అభిమానులు, స్నేహితులు మరియు సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

Virosh Wedding Reception Photos
3/10

రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ జంటను “విరోష్” అని పిలుస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి వేడుకల నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది.

Virosh Wedding Reception Photos
4/10

ఈ రిసెప్షన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా సెలబ్రిటీ రిసెప్షన్ అంటే మోడరన్ దుస్తుల్లో కనిపిస్తారని చాలా మంది అనుకున్నారు. అయితే ఈ జంట మాత్రం సంప్రదాయ లుక్‌లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది.

Virosh Wedding Reception Photos
5/10

విజయ్ దేవరకొండ పంచెకట్టు కట్టుకొని భుజంపై కండువా వేసుకుని రాయల్ లుక్‌లో కనిపించాడు. సంప్రదాయ దుస్తుల్లో ఆయన ఎంతో స్టైలిష్‌గా కనిపించడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు రష్మిక మందన్న ఎరుపు రంగు చీరలో సంప్రదాయ అందంతో మెరిసిపోయింది.

Virosh Wedding Reception Photos
6/10

ఈ జంట చేతిలో చెయ్యి వేసుకుని వేదికపైకి ఎంట్రీ ఇవ్వడం అక్కడి అతిథులను ఆకట్టుకుంది. ముందుగా వచ్చిన అతిథులను పలకరిస్తూ, ఫోటోలు దిగుతూ వేడుకలో పాల్గొన్నారు. తమ వివాహ వేడుకలన్నీ ఈ రిసెప్షన్‌తో ముగుస్తున్నాయని కూడా ఈ జంట పేర్కొంది.

Virosh Wedding Reception Photos
7/10

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు కూడా రిసెప్షన్‌కు హాజరయ్యారు.

Virosh Wedding Reception Photos
8/10

అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున, అమల దంపతులతో పాటు నాగ చైతన్య కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. వీరు విజయ్ – రష్మిక జంటతో కలిసి ఫోటోలు దిగుతూ తమ ఆశీస్సులు అందించారు.

Virosh Wedding Reception Photos
9/10

టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, నాని దంపతులు, రవితేజ, నవీన్ పొలిశెట్టి, నిర్మాత నాగవంశీ, దర్శకుడు సుకుమార్ కుటుంబం, నిర్మాత దిల్ రాజు కుటుంబం, తమిళ హీరో కార్తీ, రాధిక – శరత్‌కుమార్ దంపతులు కూడా ఈ వేడుకలో సందడి చేశారు.

X