bredcrumb

Border 2: ఎవరీ అన్య సింగ్? ఆర్మీ ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా.. బోర్డర్‌ 2 నటి గురించి తెలుసా?

By Siva Kodati
| Published: Friday, January 30, 2026, 20:40 [IST]

బోర్డర్ నటి అన్య సింగ్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా స్టైలీష్ లుక్‌లో జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.

Anya Singh Photos
1/5

అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బోర్డర్ 2. సన్నీడియోల్, వరుణ్ ధావన్, దల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టిలు కీలకపాత్రలు పోషించారు. టీ సిరీస్ ఫిల్మ్స్, జేపీ ఫిల్మ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, జేపీ దత్తాలు సంయుక్తంగా నిర్మించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న బోర్డర్ 2 వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Anya Singh Photos
2/5

విడుదలైన రోజు నుంచే సూపర్‌ హిట్ టాక్ తెచ్చుకున్న బోర్డర్ 2 మూవీ.. ఇండియాలో ఇప్పటి వరకు 224.25 కోట్ల రూపాయల నెట్.. 268.50 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 41 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 309.50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కేవలం వారం రోజుల్లోనే ఈ మూవీ 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

Anya Singh Photos
3/5

ఈ సినిమాలో మోనా సింగ్, సోనమ్ బజ్వా, మేధా రాణా, అన్య సింగ్‌లు హీరోయిన్లుగా నటించారు. గొప్ప దేశభక్తులకు భార్యలుగా వీరంతా అద్బుతంగా నటించారు. వీరి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వీరిలో అన్య సింగ్ గురించి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఈ ముద్దగుమ్మ ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చింది. 

Anya Singh Photos
4/5

అన్య తాతగారు.. 1971లో భారత్ - పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నారు. 2013లో బజాతే రహో మూవీ ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన అన్య సింగ్.. తెలుగులో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన నిను వీడని నీడను నేను మూవీలోనూ నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో హిందీపైనే ఫోకస్ పెట్టారు.

Anya Singh Photos
5/5

వెల్లే, కహో గమే హమ్ కహన్, స్త్రీ 2 చిత్రాలలో అద్భుతంగా నటించిన అన్య సింగ్‌ నటనకు ప్రశంసలు దక్కాయి. బోర్డర్‌ 2లో తను భాగం కావడం పట్ల ఈ ముద్దుగుమ్మ పొంగిపోతున్నారు. మా తాతగారు లెఫ్టినెంట్ కల్నల్ మంజిత్ సింగ్ .. 72 ఆర్మర్డ్ రెజిమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఈ సందర్భంగా ఆయనను తలచుకోవడం గర్వంగా ఉందని అన్య సింగ్ ఓ పోస్ట్ పెట్టారు. 

X