bredcrumb

Brahmamudi: చీరలో బ్రహ్మముడి విలన్ అరాచకం... అందగత్తెను అత్తగారిని చేసేశారే!

By Siva Kodati
| Published: Monday, February 9, 2026, 21:13 [IST]

స్టార్ మాలో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్‌లో రుద్రాణి రోల్ చేస్తోన్న షర్మిత గౌడ ఇ‌న్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. 

sharmitha Gowda Photos
1/5

ఇటీవలి కాలంలో సీరియల్స్‌లో హీరోయిన్లుగా, అమ్మ, అక్క, వదిన తదితర సహాయక పాత్రల్లో కనిపిస్తున్న అమ్మాయిలు అందం, అభినయంలో తిరుగులేని నిరూపిస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్‌లో విలన్‌ రుద్రాణిగా నటిస్తున్న షర్మిత గౌడ. నక్కలాంటి తెలివితేటలు, తనను పెంచిన ఇంట్లో చిచ్చుపెట్టే పాత్రలో షర్మిత అద్భుతంగా నటిస్తున్నారు.

sharmitha Gowda Photos
2/5

బ్రహ్మముడి సీరియల్‌లో హీరో మానస్ నాగులపల్లి, హీరోయిన్ దీపిక రంగరాజులను మించి డామినేట్ చేసే పాత్రలో షర్మిత జీవిస్తున్నారు. ఈ సీరియల్ ఈ స్థాయిలో మహిళా ప్రేక్షకుల ఆదరణను దక్కించుకోవడంలో షర్మిత కూడా ముఖ్యభూమిక పోషిస్తున్నారు. 

sharmitha Gowda Photos
3/5

నిజానికి హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందగత్తె అయిన ఈమెను చిన్న వయసులోనే అమ్మ, అత్త క్యారెక్టర్‌లకు అంకితం చేసేశారంటూ బుల్లితెర ప్రేక్షకులు మండిపడుతుంటారు. అయితే మనసుకు నచ్చిన పాత్ర, వృత్తి పట్ల అంకితభావం ఉన్న షర్మిత... ఎలాంటి పాత్రకైనా సై అంటున్నారు. 

sharmitha Gowda Photos
4/5

కర్ణాటకకు చెందిన షర్మిత గౌడ 1990 నవంబర్ 20న జన్మించారు. చదువు పూర్తి చేసిన అనంతరం మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె 2017లో మిస్ కర్ణాటక టైటిల్ విన్నర్ అయ్యారు. ఈ ఫేమ్‌తో పలు కన్నడ, తమిళ్ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు షర్మిత. 

sharmitha Gowda Photos
5/5

దాంతో తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి షర్మితకు పిలుపొచ్చింది. అలా బ్రహ్మముడిలో రుద్రాణి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. షూటింగ్స్ లేనప్పుడు కుటుంబంతో , సన్నిహితులతో గడిపేందుకు ఇష్టపడే షర్మిత వీలున్నప్పుడల్లా విహారయాత్రకు వెళ్తుంటారు. అది ఇండియా కావొచ్చు, ఫారిన్ కావొచ్చు ట్రిప్ వేయాల్సిందే.

X