bredcrumb

Brahmamudi Serial Cast: బ్రహ్మముడి సీరియల్‌‌లో నటీనటులెవరు? వాళ్ల అసలు పేర్లు తెలుసా?

By Siva Kodati
| Published: Thursday, September 4, 2025, 23:38 [IST]

స్టార్‌ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల ఆదరణతో దూసుకెళ్తోంది. ఈ సీరియల్‌లోని నటీనటుల అసలు పేర్లు, వారి వివరాలు పరిశీలిస్తే

brahmamudi
1/6

బ్రహ్మముడి సీరియల్‌లో దుగ్గిరాల వారి వారసుడిగా స్వరాజ్ అనే పాత్రలో నటిస్తున్నారు మానస్ నాగులపల్లి. గతంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఉన్న ఇతను, పలు సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌తో మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం బ్రహ్మముడితో పాటు జబర్దస్త్‌ కామెడీ షోకు యాంకర్‌గా చేస్తున్నాడు.

brahmamudi
2/6

బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యగా, రాజ్‌కు భార్యగా టైటిల్ రోల్ పోషిస్తున్నారు దీపిక రంగరాజు. తమిళనాడుకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. తొలుత న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత బుల్లితెర వైపు అడుగులు వేశారు. తమిళనాడులో మంచి పేరు తెచ్చుకుని తెలుగులో కావ్యగా అడుగుపెట్టాడు. 

brahmamudi
3/6

బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యకు చెల్లెలిగా అపూర్వ అనే పాత్రలో నటిస్తున్నారు నైనిషా రాయ్. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ నైనిష తెలుగులో పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఇటీవలే తన ప్రియుడితో నిశ్చితార్ధం చేసుకున్న నైనిష త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

brahmamudi
4/6

బ్రహ్మముడి సీరియల్‌లో విలన్‌గా రుద్రాణి అనే పాత్రలో నటిస్తున్నారు షర్మిత గౌడ. కర్ణాటకకు చెందిన ఈ విలక్షణ నటి.. తొలుత మోడలింగ్ చేశారు. మిస్ కర్ణాటకగా నిలిచిన షర్మిత.. కన్నడ, తమిళ్, తెలుగు ఛానెల్స్‌లో పలు ధారావాహికల్లో నటించారు. వీరు కాకుండా శ్రీప్రియ శ్రీకర్, నిపా శివ, ఇందిరా ఆనంద్, నాయుడు గోపి, గిరి శంకర్, కిరణ్ కాంత్, శ్రీకర్ కృష్ణలు బ్రహ్మముడి సీరియల్‌లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

brahmamudi
5/6

బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యకు అక్కగా స్వప్న అనే పాత్రలో నటిస్తున్నారు రూప ముగ్గళ్ల. తెలుగు బుల్లితెరపై ఈమె సుపరిచితురాలు. ఈటీవీతో పాటు పలు ఛానెల్స్‌లో సీరియల్స్‌లో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈమెకు భారీగా ఫాలోయింగ్ ఉంది.

brahmamudi
6/6

బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్‌కు క్లాస్‌మేట్‌గా, లవర్‌గా యామిని అనే పాత్రలో నటిస్తున్నారు సౌమ్యా యాదవ్. రాజ్‌ని దక్కించుకోవడానికి ఎంతకైనా తెగించే పాత్రలో సౌమ్యా యాదవ్ అద్భుతంగా నటించారు. ఈమె తెలుగులోని పలు ఛానెల్స్‌లో సీరియల్స్ చేస్తున్నారు. 

X