bredcrumb

లంగా ఓణీలో ఛాంపియన్ బ్యూటీ... పదహారణాల తెలుగు అమ్మాయిలా అనస్వర రాజన్

By Siva Kodati
| Published: Thursday, December 25, 2025, 21:24 [IST]

ఛాంపియన్ హీరోయిన్ అనస్వర రాజన్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి

Anaswara Rajan Photos
1/5

రజాకార్లు, నిజాం పాలన, తెలంగాణ సాయుధ పోరాటం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఛాంపియన్ మూవీతో తెలుగువారిని పలకరించారు కేరళ కుట్టి అనస్వర రాజన్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మంచి టాలెంటెడ్ అని నిరూపించుకుంది.

Anaswara Rajan Photos
2/5

పాతికేళ్లు కూడా లేని ఈ ముద్దుగుమ్మ మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. అందం, నటనలో తనకు తిరుగే లేదని సత్తా చాటింది. కేరళలోని కరివెల్లూరులో పుట్టి పెరిగిన అనస్వరది మామూలు మధ్య తరగతి నేపథ్యం. తల్లిదండ్రులకు ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు.

Anaswara Rajan Photos
3/5

15 ఏళ్ల వయసులోనే ఉదాహరణం సుజాత అనే సినిమాతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన అనస్వర రాజన్.. ఆ తర్వాత 2019లో తన్నీర్ మథన్ దినంగళ్ మూవీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఏడాది రిలీజై సంచలన విజయం సాధించిన అధ్యరాత్రిలో తల్లి, కూతురిగా నటించి సినీ ప్రముఖులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Anaswara Rajan Photos
4/5

కేవలం 17 ఏళ్ల వయసులోనే తల్లిగా నటించడం నటన పట్ల ఆమె అంకిత భావానికి, సాహసానికి నిదర్శనం. ఈ సినిమా తర్వాత ఆమెకు విభిన్నమైన పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. గ్లామర్ రోల్స్‌కు దూరంగా నటనా ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తున్నారు అనస్వర రాజన్.

Anaswara Rajan Photos
5/5

ఛాంపియన్‌లో చంద్రకళగా తెలుగువారిని పలకరించిన అనస్వర రాజన్.. పల్లెటూరి అమ్మాయిగా అందంగా కనిపిస్తూనే, పోరాట సన్నివేశాలలోనూ అద్భుతంగా నటించింది. తెలుగులో ఇట్లు అర్జున అనే  మరో చిత్రంలోనూ అనస్వర నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+