bredcrumb

బ్లాక్ డ్రెస్‌లో రాధిక టెంప్టింగ్ ఫోజులు .. బటన్ తీసేసి కవ్వింపులు

By Siva Kodati
| Published: Sunday, February 16, 2025, 20:18 [IST]

హీరోయిన్ నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి

Neha Shetty PhotoShoot
1/5

టాలీవుడ్‌లో ఇప్పుడు కన్నడ బ్యూటీలదే హవా. అనుష్క శెట్టి, రష్మిక మందన్న, కృతి శెట్టి, ఆషిక రంగనాథ్, శ్రీలీల వంటి వారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి బాటలోనే తెలుగు ఇండస్ట్రీలో వెలిగిపోవడానికి వచ్చింది నేహా శెట్టి.
Neha Shetty PhotoShoot
2/5

కర్ణాటకలోని మంగుళూరులో పుట్టిన నెహాశెట్టి అక్కడే పెరిగారు. తల్లి డెంటిస్ట్ కాగా, తండ్రి వ్యాపారవేత్త. ఈమెకు ఒక చెల్లి కూడా ఉంది. చిన్న వయసులోనే మోడలింగ్‌లో దిగిన నేహా శెట్టి 2014లో మిస్ మంగళూరుగా కిరీటాన్ని దక్కించుకున్నారు. అలాగే 2015లో మిస్ సౌతిండియా పోటీల్లో రన్నరప్‌గా నిలిచారు .
Neha Shetty PhotoShoot
3/5

కన్నడ చిత్రం ముంగరు మేల్ 2 చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన నేహా శెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబాలో ఆమెకు హీరోయిన్‌గా అవకాశం దక్కింది. ఆ తర్వాత మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌లో సెకండ్ హీరోయిన్ రోల్‌లో నటించారు నేహా.
Neha Shetty PhotoShoot
4/5

ఈ క్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన డీజే టిల్లూ మూవీ నేహా శెట్టి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రాధికగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన నేహా .. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం బెదురులంక, రూల్స్ రంజన్‌, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలలో నటించినా అవి నిరాశపరిచాయి.
Neha Shetty PhotoShoot
5/5

అయితే 2025లో ఆమె మరో కొత్త సినిమాకు కమిట్ కాలేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నేహా శెట్టి.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఎద, నడుము, నాభి అందాలను చూపిస్తూ ఆమె చేసిన ఫోటో షూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+