bredcrumb

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న ఈషా రెబ్బా..

By Rajesh Karampoori
| Published: Thursday, February 5, 2026, 20:32 [IST]

Eesha Rebba: నటి ఈషా రెబ్బా తాజా గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె స్టైలిష్ లుక్స్, కొత్త సినిమా అప్‌డేట్స్ పూర్తి వివరాలు  

Eesha Rebba
1/6

ఈషా రెబ్బా (Eesha Rebba) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. అందం, అభినయం రెండింట్లోనూ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా, కెరీర్‌ను కంటిన్యూ చేసే భారీ బ్రేక్ మాత్రం ఇప్పటివరకు దక్కలేదనే చెప్పాలి.

Eesha Rebba
2/6

తాజాగా ఈషా నటిస్తున్న ఓం శాంతి శాంతి శాంతిః  సినిమాతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ మూవీలో దర్శకుడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో కనిపించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో ఈషా–తరుణ్ భాస్కర్ మధ్య రిలేషన్ ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఈషా… ఈ విషయంపై స్పష్టంగా అవునా కాదా చెప్పకుండా “ఏదైనా ఉంటే నేనే చెబుతాను” అంటూ స్మార్ట్‌గా తప్పించుకుంది.

Eesha Rebba
3/6

అదే ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయం కూడా బయటపెట్టింది ఈషా. సినిమాలోని ఓ సన్నివేశం కోసం తరుణ్ భాస్కర్ నిజంగానే తనను గట్టిగా కొట్టాడని చెప్పింది. ఊహించని ఆ మూమెంట్‌లో కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పడంతో ఈ వీడియో క్లిప్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

Eesha Rebba
4/6

కెరీర్ విషయానికి వస్తే… బండిపోటు, సవ్యసాచి, అంతకముందు, ఆ తర్వాత, జీవితం అందంగా ఉంది, అరవింద సమేత, బెంగాల్ టైగర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆహానా పెళ్లంట ఇలా చాలా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ, వరుస హీరోయిన్ ఛాన్సులు మాత్రం రాలేదు. దీంతో ఓటీటీ ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టింది.

Eesha Rebba
5/6

ఇటీవల సోషల్ మీడియాలో ఈషా షేర్ చేస్తున్న గ్లామరస్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. షర్ట్ బటన్స్ ఓపెన్ చేసిన స్టైలిష్ లుక్స్ నుంచి ట్రెడిషనల్ అవతార్ వరకు… ప్రతి లుక్‌తోనూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అందంతో పాటు కాన్ఫిడెన్స్ కూడా ఈషా ప్లస్ పాయింట్‌గా మారింది.

Eesha Rebba
6/6

తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈషా అక్కడ మంచి స్పందన అందుకుంటోందట. వరుసగా కొత్త ఆఫర్లు వస్తున్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. సరైన బ్రేక్ పడితే మరోసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోయిన్‌గా వెలిగే ఛాన్స్ ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తానికి, లేట్ అయినా లక్కు కలిసొస్తుందనే నమ్మకంతో ఈషా రెబ్బ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

X