bredcrumb

లంగా ఓణీలో అదరహో అనేలా.. చూపు తిప్పుకోని అందంతో ఈషా రెబ్బా

By Siva Kodati
| Published: Saturday, December 27, 2025, 20:43 [IST]

సినీనటి, ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా స్టైలీష్ లుక్‌లో ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. 

Eesha Rebba Photos
1/5

అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో హల్‌చల్ చేస్తున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పదేళ్లు కావొస్తున్నా ఈ ముద్దుగుమ్మకు చెప్పుకోదగ్గ స్థాయిలో భారీ అవకాశాలు రాలేదు. అయినప్పటికీ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

Eesha Rebba Photos
2/5

నటన, అందం పరంగా తిరుగులేదని నిరూపించుకున్నప్పటికీ ఈషా రెబ్బాకు హీరోయిన్‌గా ఓ రేంజ్‌లో అవకాశాలు దక్కలేదు. స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ దొరుకుతుందని ఎదురుచూసినప్పటికీ అది అందని ద్రాక్షే అయ్యింది. ఒకటి రెండు స్టార్ హీరోల సినిమాలలో సెకండ్ లీడ్‌గా నటించి దానితోనే సంతృప్తి పడింది.

Eesha Rebba Photos
3/5

త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ నటించిన అరవింద సమేతలో ఈషాకు అవకాశం దక్కింది. అయితే అది సెకండ్ లీడ్ అయినప్పటికీ ఆమె అంగీకరించారు. తన పాత్రకు కీలకమైన స్కోప్ ఉందని, కానీ ఆ సీన్లను ఎడిటింగ్‌లో తీసేయడంతో చాలా బాధపడినట్లు ఈషా పలుమార్లు తెలిపారు.

Eesha Rebba Photos
4/5

ఇటీవల ఈషా రెబ్బా, కుషిత కల్లపు, రాశీ సింగ్, సత్య, హర్ష చెముడు, సూర్య శ్రీనివాస్ , సత్యం రాజేశ్ తదితరులు నటించిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్ - 2 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఇందులో ఈషా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. 

Eesha Rebba Photos
5/5

ముగ్గురు అమ్మాయిల జీవితం, లవ్, కెరీర్, పర్సనల్ స్పేస్‌ను ఈషా, కుషిత, రాశీ సింగ్‌లు అద్భుతంగా ఆవిష్కరించారు. డైరెక్టర్ మారుతి ఈ వెబ్ సిరీస్‌కు క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరించారు. కిరణ్ కే కరవల్ల దర్శకత్వం వహించారు. కుర్రకారు నుంచి ఈ వెబ్ సిరీస్‌‌కు మంచి ఆదరణ లభిస్తోంది. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+