By
Rajesh Karampoori
| Published: Sunday, December 28, 2025, 21:32 [IST]
Girija Oak: గిరిజా ఓక్ తాజా శారీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ న్యూ నేషనల్ క్రష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఓ లూక్కేయండి.
1/6
అందంతో చంపేస్తోందిగా.. ట్రెండీ లుక్‌లో ట్రెండ్ అవుతోన్న గిరిజా.. | Girija Oak’s Latest Saree Photos Go Viral, Social Media Calls Her The New National Crush - Filmibeat Telugu
/photos/feature/girija-oaks-latest-saree-photos-go-viral-social-media-calls-her-the-new-national-crush-fb104437.html
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు స్టార్ అవుతారో చెప్పలేని పరిస్థితి. తాజాగా అదే మ్యాజిక్ మరాఠీ నటి గిరిజా ఓక్ (Girija Oak) విషయంలో జరిగింది. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియో క్లిప్స్ ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయ్యాయి. ముఖ్యంగా బ్లూ–గ్రీన్ శారీలో, స్టైలిష్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో ఆమె కనిపించిన లుక్ నెటిజన్లను ఆకట్టుకుంది. ఆమె సింపుల్ స్టైల్, సహజమైన అందమే ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
2/6
అందంతో చంపేస్తోందిగా.. ట్రెండీ లుక్‌లో ట్రెండ్ అవుతోన్న గిరిజా.. | Girija Oak’s Latest Saree Photos Go Viral, Social Media Calls Her The New National Crush - Filmibeat Telugu
/photos/feature/girija-oaks-latest-saree-photos-go-viral-social-media-calls-her-the-new-national-crush-fb104437.html#photos-1
ఆమె ఫొటోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవడంతో “ఈ బ్యూటీ ఎవరు?” అనే ప్రశ్న నెటిజన్లలో మొదలైంది. సెర్చ్ చేయగా, ఆ వైరల్ ఫొటోలో ఉన్నది దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న గిరిజా ఓక్ గోడ్‌బోలే అని తెలిసింది. సడెన్‌గా ఆమె పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఇండియా న్యూ నేషనల్ క్రష్’ అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
3/6
అందంతో చంపేస్తోందిగా.. ట్రెండీ లుక్‌లో ట్రెండ్ అవుతోన్న గిరిజా.. | Girija Oak’s Latest Saree Photos Go Viral, Social Media Calls Her The New National Crush - Filmibeat Telugu
/photos/feature/girija-oaks-latest-saree-photos-go-viral-social-media-calls-her-the-new-national-crush-fb104437.html#photos-2
గిరిజా ఓక్ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఆమెకు నటన కొత్త కాదు. ఫేమస్ మరాఠీ నటుడు గిరీష్ ఓక్ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చిన గిరిజా, మరాఠీతో పాటు హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ‘తారే జమీన్ పర్’, ‘షోర్ ఇన్ ది సిటీ’ వంటి సినిమాలతో పాటు, ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’లో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించింది.
4/6
అందంతో చంపేస్తోందిగా.. ట్రెండీ లుక్‌లో ట్రెండ్ అవుతోన్న గిరిజా.. | Girija Oak’s Latest Saree Photos Go Viral, Social Media Calls Her The New National Crush - Filmibeat Telugu
/photos/feature/girija-oaks-latest-saree-photos-go-viral-social-media-calls-her-the-new-national-crush-fb104437.html#photos-3
వైరల్ అయిన ఫొటోలపై గిరిజా స్పందన కూడా నెటిజన్లను ఇంప్రెస్ చేసింది. ఒక్కసారిగా వచ్చిన ఈ క్రేజ్ తనను ఆశ్చర్యపరిచిందని చెప్పింది. నాటక రిహార్సల్స్ సమయంలో ఫోన్ నిరంతరం మోగుతుండటమే ఈ వైరాలిటీని గుర్తు చేసిందని సరదాగా చెప్పుకొచ్చింది. అయితే ఈ ఫేమ్ వల్ల తన పాత వర్క్‌ను మరింత మంది చూసే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపింది.
5/6
అందంతో చంపేస్తోందిగా.. ట్రెండీ లుక్‌లో ట్రెండ్ అవుతోన్న గిరిజా.. | Girija Oak’s Latest Saree Photos Go Viral, Social Media Calls Her The New National Crush - Filmibeat Telugu
/photos/feature/girija-oaks-latest-saree-photos-go-viral-social-media-calls-her-the-new-national-crush-fb104437.html#photos-4
కొందరు ఆమెను హాలీవుడ్ స్టార్స్‌తో పోల్చుతూ పొగిడినా, కొన్ని సందర్భాల్లో తన ఫొటోలు తప్పుగా వాడటం ఇబ్బంది పెట్టిందని కూడా గిరిజా ఓపెన్‌గా చెప్పింది. అయినా, “ట్రెండ్స్ వస్తాయి–పోతాయి, కానీ నా పని శాశ్వతం” అంటూ చాలా మెచ్యూర్డ్‌గా స్పందించింది. ఈ మాటలు ఆమె వ్యక్తిత్వాన్ని మరింత ఎలివేట్ చేశాయి.
6/6
అందంతో చంపేస్తోందిగా.. ట్రెండీ లుక్‌లో ట్రెండ్ అవుతోన్న గిరిజా.. | Girija Oak’s Latest Saree Photos Go Viral, Social Media Calls Her The New National Crush - Filmibeat Telugu
/photos/feature/girija-oaks-latest-saree-photos-go-viral-social-media-calls-her-the-new-national-crush-fb104437.html#photos-5
మొత్తానికి, ఒక సింపుల్ ఫొటోతో మొదలైన ఈ వైరల్ ట్రెండ్ గిరిజా ఓక్‌ను దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. గ్లామర్ హంగులు కాకుండా, సహజమైన అందం, సింప్లిసిటీతో కూడా స్టార్‌గా మారొచ్చని ఆమె మరోసారి నిరూపించింది. ఇప్పుడు గిరిజా ఓక్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్ట్‌లో నిలిచింది.