bredcrumb

అందంతో జగతి మేడమ్ అరాచకం.. కుర్రకారు అలా చూస్తూ ఉండిపోవాల్సిందే..

By Rajesh Karampoori
| Published: Tuesday, February 10, 2026, 21:20 [IST]

Jyothi Rai photos: గుప్పెడంత మనసు జగతి మేడం అలియాస్ జ్యోతిరాయ్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

Jyothi Rai latest photos
1/6

Jyothi Rai photos: జగతి మేడం అలియాస్ జ్యోతిరాయ్ ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. సీరియల్ ముగిసినా ఆమెకు ఉన్న ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బుల్లితెర స్టార్‌గా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిరాయ్ సీరియల్స్‌కు సడెన్‌గా గుడ్‌బై చెప్పడం అభిమానులకు షాక్ ఇచ్చింది.

Jyothi Rai latest photos
2/6

కర్ణాటకకు చెందిన జ్యోతిరాయ్ తొలుత కన్నడ సీరియల్స్ ద్వారా ఫేమ్ సాధించారు. ‘జెర్సీ నెంబర్ 10’, ‘దియా’, ‘సప్లయర్ శంకర’ వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టి ‘కన్యాదానం’ సీరియల్‌తో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Jyothi Rai latest photos
3/6

స్టార్ మాలో ప్రసారమైన ‘గుప్పెడంత మనసు’ ఆమె కెరీర్‌ను మలుపుతిప్పింది. జగతి మేడం పాత్రలో లెక్చరర్‌గా, తల్లిగా, విడిపోయిన భార్యగా ఆమె చూపిన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ పాత్ర చనిపోయిన తర్వాత సీరియల్ రేటింగ్స్ తగ్గాయనే మాటలు కూడా వినిపించాయి.

Jyothi Rai latest photos
4/6

సీరియల్ ముగిసిన తర్వాత జ్యోతిరాయ్ అనూహ్యంగా బుల్లితెరకు దూరమై సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టారు. సుక్కు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ మాస్టర్ పీస్’లో నటించిన ఆమె, ఇప్పుడు ‘కిల్లర్’ అనే యాక్షన్–సైన్స్ ఫిక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఫ్రాంచైజీగా పలు భాగాలుగా తెరకెక్కనుంది.

Jyothi Rai latest photos
5/6

ఇక ఆన్‌స్క్రీన్‌లో సాంప్రదాయంగా కనిపించిన జగతి మేడం, ఆఫ్‌స్క్రీన్‌లో మాత్రం గ్లామర్ షోతో యూత్‌ను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఆమె ధరించిన చిక్ ఫ్లోరల్ మినీ డ్రస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింపుల్ స్టైలింగ్, కాన్ఫిడెంట్ పోజింగ్ ఆమె లుక్‌ను మరింత హైలైట్ చేశాయి.

Jyothi Rai latest photos
6/6

జ్యోతిరాయ్ బుల్లితెర నుంచి వెండితెరకు, హోమ్లీ ఇమేజ్ నుంచి గ్లామర్ లుక్ వరకు సక్సెస్‌ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తున్నారు. ఇదే ఊపులో ఆమె సినిమాల్లోనూ బలమైన పాత్రలతో మెప్పిస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

X