bredcrumb

40 ఏళ్ల వయసులో కూడా చందమామ అందాలు.. కాజల్ స్టన్నింగ్ లుక్స్ వైరల్..

By Rajesh Karampoori
| Published: Saturday, January 31, 2026, 21:23 [IST]

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 40 ఏళ్ల వయసులోనూ ఆమె స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఓ లూక్కేయండి. 

Kajal Aggarwal Photos
1/6

నలభై ఏళ్ల వయసులోనూ చందమామలా మెరిసిపోతున్న నటి  కాజల్ అగర్వాల్ మరోసారి తన స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉంటుంది. కానీ ఆ అభిప్రాయాన్ని పూర్తిగా తప్పు అని నిరూపించిన అరుదైన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. దాదాపు 20 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ, ఇప్పటికీ అదే గ్లామర్‌, అదే ఫ్యాన్ ఫాలోయింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Kajal Aggarwal Photos
2/6

హీరోయిన్లు గరిష్టంగా మూడు నుంచి ఐదేళ్ల వరకే లైమ్‌లైట్‌లో ఉంటారని అంటారు. అలాంటి పరిస్థితుల్లో కాజల్ మాత్రం రెండు దశాబ్దాల కెరీర్‌ను పూర్తి చేసుకుని ఈ జనరేషన్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అందం మాత్రమే కాదు, పాత్రల ఎంపికలోనూ కాజల్ తీసుకునే జాగ్రత్తలు ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు అభిమానులను మరోసారి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Kajal Aggarwal Photos
3/6

ముంబైలో స్థిరపడిన పంజాబీ కుటుంబంలో జన్మించిన కాజల్ అగర్వాల్, తొలుత హిందీ సినిమాలతో నటనకు పరిచయమయ్యారు. ఆ తర్వాత  లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ద్వారా ఆమె టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే కలువల్లాంటి కళ్లతో, ఆకట్టుకునే అందంతో యువతను కట్టిపడేశారు.

Kajal Aggarwal Photos
4/6

కాజల్ కెరీర్‌కు అసలైన బ్రేక్ ఇచ్చింది కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన  చందమామ. ఆ సినిమా తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన  మగధీర ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మగధీర ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో కాజల్ ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. ఆ తర్వాత మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకున్నారు.

Kajal Aggarwal Photos
5/6

తెలుగుతో పాటు తమిళంలోనూ విజయ్, సూర్య, కార్తీ వంటి అగ్ర నటులతో సినిమాలు చేస్తూ దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు కాజల్. మధ్యమధ్యలో హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. స్టార్ హీరోయిన్‌గా పీక్స్‌లో ఉన్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను ప్రేమించి వివాహం చేసుకోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.

Kajal Aggarwal Photos
6/6

వివాహం తర్వాత కమర్షియల్ సినిమాలను కొంతవరకు తగ్గించిన కాజల్, లేడీ ఓరియెంటెడ్ పాత్రలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఒక కుమారుడికి తల్లిగా మారినప్పటికీ, తన ఫిట్‌నెస్‌, గ్లామర్‌ను ఏమాత్రం తగ్గకుండా కెరీర్‌ను సమతుల్యంగా కొనసాగిస్తున్నారు. నలభై ఏళ్ల వయసులోనూ స్టన్నింగ్ లుక్స్‌తో యువ హీరోయిన్లకు పోటీగా నిలుస్తున్న కాజల్ అగర్వాల్, నిజంగా “చందమామ” అనే బిరుదుకు తగిన నటి అని అభిమానులు కొనియాడుతున్నారు.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+