bredcrumb

మాయాలోకంలో విహరిస్తోన్న కాయదు లోహర్.. చీరలో పరువాల విందు

By Siva Kodati
| Published: Friday, January 23, 2026, 20:41 [IST]

హీరోయిన్ కాయదు లోహర్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ఆ ఫోటోలు మీకోసం

kayadu lohar Photos
1/5

పేరుతోనే పాపులర్ అయ్యారు కాయదు లోహర్. ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి స్టార్‌గా మారిపోయారు ఈ ముద్దుగుమ్మ. అంతకుముందు పలు చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు ఆమెకు డ్రాగన్ మూవీతో వచ్చింది. ఆ తర్వాతి నుంచి కాయదు లోహార్ బిజీ అయిపోయారు.

kayadu lohar Photos
2/5

అస్సాంలోని తేజ్‌పుర్‌కు చెందిన కాయదు లోహర్ తొలుత కన్నడ చిత్రం ముగిల్‌పేటే అనే సినిమా ద్వారా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. అనంతరం పోతన్‌పోతం నూట్టాండు అనే మలయాళ మూవీలలో నటించారు. ఈ దశలో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన అల్లూరి అనే సినిమా ద్వారా తెలుగువారిని పలకరించారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కాయదు అందాలకు యువత ఫిదా అయ్యారు.

kayadu lohar Photos
3/5

ఈ దశలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన డ్రాగన్ మూవీతో కాయదు లోహర్ దశ తిరిగింది. ఇందులో ఆమె నటన, అందానికి యూత్ బ్రహ్మరథం పట్టారు. ఈ ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు కాయదు లోహర్. డ్రాగన్ తర్వాత ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. 

kayadu lohar Photos
4/5

ప్రస్తుతం కాయదు లోహర్ చేతిలో దాదాపు 10 సినిమాలు ఉన్నాయి. తెలుగులో ఫంకీ, ది ప్యారడైజ్‌తో పాటు తమిళంలో ఇదయం మురళి, ఇమ్మోర్టల్, ఎస్టీఆర్ 49... మలయాళంలో ఐయామ్ గేమ్, పల్లిచట్టాంబీ, థారం అనే సినిమాలో నటిస్తున్నారు. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. 

kayadu lohar Photos
5/5

ఇక గతేడాది కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్ కరూర్‌లో నిర్వహించిన రోడ్ షోలో దాదాపు 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా... 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే దీనిపై కాయదు పెట్టినట్లుగా ఉన్న సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి. దాంతో కాయద్ లోహర్‌పై విజయ్ అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. అయితే ఈ పోస్టులు తాను చేయలేదని.. తన పేరుతో నకిలీ ఖాతా సృష్టించి దాని నుంచి పోస్టులు పెట్టారని కాయదు లోహార్ క్లారిటీ ఇచ్చింది. 

X