bredcrumb

కీర్తి సురేష్ అందాల విందు... మహానటి కొత్త లుక్ చూశారా?

By Siva Kodati
| Published: Saturday, January 24, 2026, 20:37 [IST]

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలు ఒకసారి పరిశీలిస్తే..

Keerthy Suresh Photos
1/5

స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న దశలో అనూహ్యంగా నెంబర్ గేమ్‌లో వెనుకబడ్డారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్నా ఆమెకు బ్రేక్ రావడం లేదు. దాంతో వినూత్నమైన కథలు ఎంచుకుని తన మార్క్ చూపించాలని కీర్తి సురేష్ గట్టి పట్టుదలతో ఉన్నారు. 

Keerthy Suresh Photos
2/5

బలమైన సినీ నేపథ్యం ఉండటంతో పెద్దగా కష్టపడకుండానే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కీర్తి సురేష్. కానీ ఇక్కడ నెగ్గుకు రావడం అంత తేలిక కాదని ఈ ముద్దుగుమ్మ త్వరగానే గ్రహించింది. హీరోయిన్ అయ్యాక ఆమె నటించిన సినిమాలన్నీ ఒకదాని తర్వాత మరొకటి ఫ్లాప్ కావడంతో ఐరెన్ లెగ్ ట్యాగ్ తెచ్చుకుంది కీర్తి. కానీ ఎక్కడా తగ్గకుండా నటనకు మెరుగులు దిద్దుకుని విమర్శకులకు కౌంటర్ ఇచ్చింది.

Keerthy Suresh Photos
3/5

రామ్ పోతినేని హీరోగా వచ్చిన నేను శైలజతో తెలుగు వారిని పలకరించిన కీర్తి సురేష్‌కు ఆ సినిమా విజయం సాధించడంతో మరిన్ని అవకాశాలు క్యూకట్టాయి. ఈ దశలో దిగ్గజ నటి, మహానటి సావిత్రి జీవిత కథతో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'మహానటి'లో టైటిల్ రోల్ పోషించే అవకాశం దక్కించుకుంది కీర్తి సురేష్.

Keerthy Suresh Photos
4/5

నటనకే లైబ్రరీగా చెప్పుకునే మహానటి పాత్ర పోషిస్తుండటంతో కీర్తి సురేష్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయినప్పటికీ ఆ పాత్రను ఓ సవాల్‌గా తీసుకుని, ఒత్తిడిని అధిగమించి సావిత్రి పాత్రకు ప్రాణం పోసి ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. ఈ సినిమాలో నటనకు ఏకంగా జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుని విమర్శలకు చెక్ పెట్టింది కీర్తి సురేష్.

Keerthy Suresh Photos
5/5

గతేడాది తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిని పెళ్లాడిన ఈ ముద్దగుమ్మ.. వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కీర్తి సురేష్. ప్రస్తుతం తమిళంలో కన్నివిడి, మలయాళంలో తోట్టం, తెలుగులో రౌడీ జనార్థన సినిమాలలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఆమె కృతనిశ్చయంతో ఉన్నారు.

X