bredcrumb

ప్రభాస్ బ్యూటీ అందాల జాతర.. మాళవిక సోయగాలు అదరహో!

By Rajesh Karampoori
| Published: Tuesday, February 3, 2026, 22:28 [IST]

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె గ్లామరస్ లుక్స్, స్టైలిష్ ఔట్‌ఫిట్స్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

Malavika Mohanan
1/6

మలయాళ బ్యూటీ  మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి వరుస సినిమాలతో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. నటనతో పాటు గ్లామర్, ఫ్యాషన్ సెన్స్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోంది.

Malavika Mohanan
2/6

తెలుగులో ఆమెకు వచ్చిన బ్రేక్ మాత్రం భారీదే. ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టడం వల్ల మాళవిక క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. సినిమా టాక్ ఎలా ఉన్నా సరే, తెలుగులో మాత్రం ఆమెకు వరుసగా అవకాశాలు వస్తుండటం విశేషం. స్టార్ హీరోల సరసన నటిస్తూ, టాలీవుడ్‌లో తన స్థానం బలపరుచుకునే ప్రయత్నాలు చేస్తోంది.

Malavika Mohanan
3/6

ఇక తమిళ్‌లో ‘సర్దార్ 2’, మలయాళంలో ‘హృదయపూర్వం’ వంటి ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.  అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ పాన్-ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. వరుస సినిమాలతో ప్రస్తుతం మాళవిక ఫుల్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Malavika Mohanan
4/6

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా మాళవిక చాలా యాక్టివ్. తరచూ తన లేటెస్ట్ ఫొటోషూట్స్, స్టైలిష్ లుక్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వైట్ కలర్ పొట్టి గౌన్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ లుక్‌లో మాళవిక బ్యూటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Malavika Mohanan
5/6

ఇటీవల ఓ ఈవెంట్ లో  మాళవిక ధరించిన బ్లాక్ టూ-పీస్ ఎన్‌సెంబుల్ కూడా ఫ్యాషన్ లవర్స్‌ను ఆకట్టుకుంది. గ్లోసీ స్ట్రాప్‌లెస్ టాప్, డ్రేప్డ్ బ్లాక్ స్కర్ట్ కలయిక ఆమెకు మోడ్రన్, ఎడ్జీ లుక్‌ను ఇచ్చింది. మినిమల్ స్టైలింగ్‌తో ఈ ఔట్‌ఫిట్ మరింత పవర్‌ఫుల్‌గా కనిపించింది.

Malavika Mohanan
6/6

మొత్తానికి, సినిమాల్లో బిజీగా ఉండటమే కాకుండా, సోషల్ మీడియాలో తన స్టైలిష్ అపియరెన్సులతోనూ మాళవిక మోహనన్ హాట్ టాపిక్‌గా మారుతోంది. నటన, గ్లామర్, ఫ్యాషన్ మూడు రంగాల్లోనూ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్న ఈ బ్యూటీ, రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

X