bredcrumb

గత్తర లేపుతున్న మీనూ.. ఆ పోజులు చూస్తే కుర్రాళ్లు ఏం కాను..

By Rajesh Karampoori
| Updated: Sunday, February 8, 2026, 21:03 [IST]

Meenakshi Chaudhary: టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అందం, అభినయంతో పాటు గ్లామర్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఆమె ఫ్యాన్‌బేస్‌ను వేగంగా పెంచుకుంటోంది. తాజాగా విడుదలైన మీనాక్షి లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా, ఆమె స్టన్నింగ్ లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి. 

Meenakshi Chaudhary
1/6

టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలోమీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఒకరు. అందం, అభినయం మాత్రమే కాదు… గ్లామర్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలను తెలివిగా ఎంచుకుంటూ ఆమె తన ఫాలోయింగ్‌ను వేగంగా పెంచుకుంటోంది. కొత్త హీరోయిన్ల మధ్య తీవ్ర పోటీ ఉన్నా, మీనాక్షి మాత్రం తనదైన స్టైల్‌తో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

Meenakshi Chaudhary
2/6

హర్యానాకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తొలి అడుగు వేసిన తర్వాత మొదట కొంత కష్టకాలాన్ని ఎదుర్కొంది. సరైన బ్రేక్ కోసం ఓపికగా ఎదురు చూసిన మీనాక్షికి అసలైన టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందిహిట్ 2 ( HIT: The Second Case). ఇందులో  అడివి శేషు సరసన నటించిన ఆమెకు నటిగా మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా విజయం తర్వాత మీనాక్షి కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.

Meenakshi Chaudhary
3/6

ఆ తర్వాత వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలు ఆమె ఖాతాలో భారీ విజయాలుగా నిలిచాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత మీనాక్షి క్రేజ్ నెక్ట్స్ లెవల్‌కు చేరగా, ట్రేడ్ వర్గాలు ఆమెను ‘మోస్ట్ వాంటెడ్ హీరోయిన్’గా పిలవడం మొదలుపెట్టాయి.

Meenakshi Chaudhary
4/6

గత ఏడాది సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ అందుకున్న మీనాక్షి… ఈ ఏడాది కూడా అదే పండుగకు అనగనగా ఒక రాజు తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి సరసన ఆమె నటనకు మంచి స్పందన వస్తోంది. సంక్రాంతి బరిలో ఉన్న ఇతర సినిమాలకు గట్టి పోటీ ఇచ్చి ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం మీనాక్షి కెరీర్‌కు మరింత బలం చేకూర్చింది.

Meenakshi Chaudhary
5/6

ఇదే కాకుండా ప్రస్తుతం నాగ చైతన్య సరసన ‘వృషకర్మ’ అనే మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కూడా ఆమె నటిస్తోంది. ఈ సినిమాతో మీనాక్షి స్టార్‌డమ్ మరింత పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. చేతినిండా సినిమాలు, వరుస విజయాలతో ఆమె టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌ల జాబితాలోకి వేగంగా దూసుకెళ్తోంది.

Meenakshi Chaudhary
6/6

మొదటి దశలో ఎదురైన ఆటంకాలను దాటుకుని, ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి ప్రయాణం ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా మారుతోంది. సరైన అవకాశం కోసం ఎదురుచూసి, వచ్చిన బ్రేక్‌ను పూర్తిగా వినియోగించుకుంటే కెరీర్ ఎలా మారుతుందో ఆమె ఉదాహరణగా నిలుస్తోంది.

X