bredcrumb

Meenakshi Chaudhary : లంగా ఓణీలో కుర్రాళ్ల గుండెల్లో లంగర్ వేస్తోన్న డాక్టరమ్మ

By Siva Kodati
| Updated: Tuesday, February 4, 2025, 00:14 [IST]

సినీనటి మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. యెల్లో కలర్ లంగా ఓణీలో స్టైలీష్ లుక్‌లో ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి

Meenakshi Chaudhary PhotoShoot
1/5

హర్యానాలోని పంచకులలో జన్మించిన మీనాక్షి చౌదరిది మిలటరీ కుటుంబం. ఆమె తండ్రి దివంగత బీఆర్ చౌదరి భారత సైన్యంలో కల్నల్‌ హోదాలో పనిచేశారు. చండీగఢ్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన మీనాక్షి మంచి క్రీడాకారిణి కూడా.

Meenakshi Chaudhary PhotoShoot
2/5

స్టేట్ లెవల్ స్విమ్మర్, బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ఆమె రాణించారు. డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో బీడీఎస్ పూర్తి చేశారు మీనాక్షి చౌదరి. 2017లో మిస్ ఐఎంఏ పోటీల్లో పాల్గొన్నారు.

Meenakshi Chaudhary PhotoShoot
3/5

మోడల్‌గా అనేక ఫేమస్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా పనిచేసిన మీనాక్షి చౌదరికి అప్‌స్టార్ట్స్ అనే హిందీ సినిమాలో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగువారిని పలకరించారు.

Meenakshi Chaudhary PhotoShoot
4/5

ఆ వెంటనే ఖిలాడీ, హిట్ 2, కొలై, గుంటూరు కారంలో నటించారు. ఖిలాడీలో రొమాంటిక్ సీన్స్‌లో నటించినా ఆమెకు హిట్ దక్కలేదు. కానీ పాపులారిటీ మాత్రం సొంతం చేసుకుంది. సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మీనాక్షికి లక్కీ భాస్కర్ రూపంలో ఘన విజయం దక్కింది.

Meenakshi Chaudhary PhotoShoot
5/5

త్వరలో ఆమె నటించిన వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్‌సేన్ మెకానిక్ రాకీలపైనే భారీ అంచనాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభరలోనూ మీనాక్షి కీలకపాత్ర పోషిస్తున్నారు. వీటిలో ఏ ఒక్కటి హిట్ అయినా ఆమె స్టార్ హీరోయిన్ దిశగా అడుగులు వేయడం ఖాయం.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+