బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ మేన కోడలు, దర్శకుడు మన్సూర్ ఖాన్ కూతురు జేయన్ మేరీ ఖాన్ హిందీ సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. ఆమె తొలిసారి డెకాయిట్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.


Click it and Unblock the Notifications
Bollywood superstar Aamir Khan's niece and Director Mansoor Khan's daughter Zayn Marie Khan to introduce to Tollywood debut with Adivi Sesh’s Dacoit. Here her lastest photoshoot.
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ మేన కోడలు, దర్శకుడు మన్సూర్ ఖాన్ కూతురు జేయన్ మేరీ ఖాన్ హిందీ సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. ఆమె తొలిసారి డెకాయిట్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.
కపూర్ అండ్ సన్స్, సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలకు జేయన్ మేరీ ఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన మిస్ సీరియల్ కిల్లర్ సినిమా ద్వారా నటిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఫీల్స్ లైక్ ఇష్క్ వెబ్ సిరీస్‌లో నటించారు.
ఇటీవల జేయన్ మేరీ ఖాన్ మోనికా ఓ మై డార్లింగ్ సినిమాలో నటించారు. అలాగే మేడ్ ఇన్ హెవెన్, ఇల్లీగల్: జస్టిస్ అవుట్ ఆఫ్ ఆర్డర్ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలను పోషించారు.
జేయన్ మేరీ ఖాన్ తన స్నేహితుడు ఆకాష్ మోహిమెన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. అయితే వారిద్దరూ విడిపోయినట్టు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు 5 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారనే రూమర్లు మీడియాలో వచ్చాయి. అయితే ఈ బ్రేకప్ వార్తలను ఆమె సీరియస్‌గా తీసుకోలేదు.
ఆకాశ్ మెహిమేన్‌తో బ్రేకప్ వార్తలపై జేయన్ మేరీ ఖాన్ స్పందిస్తూ నా వ్యక్తిగత విషయాల గురించి నేను మాట్లాడను. నా ప్రైవసీకి భంగం కలిగించకండి. సమాజంలో ఇంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి. వాటిపై దృష్టిపెట్టండి అంటూ ఆమె మీడియా వార్తలపై ఘాటుగా స్పందించారు.
అడివి శేష్, మృణాల్ థాకూర్ జంటగా నటిస్తున్న డెకాయిట్ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పెర్ఫార్మెన్స్‌తోపాటు గ్లామర్‌ను కూడా పంచే ప్రయత్నం చేసినట్టు ప్రమోషనల్ కంటెంట్ స్పష్టం చేసింది. తెలుగులో ఆమెకు మంచి అవకాశాలు రావాలని ఫిల్మీబీట్ కోరుకొంటున్నది.
హిందీ సినిమా పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొన్న జేయన్ మేరీ ఖాన్ ప్రస్తుతం తెలుగులో తన మార్కును చూపించేందుకు రెడీ అయింది.
ముంబైలో 1995 సంవత్సరంలో జన్మించారు. ఆమెకు ఓ సోదరుడు ఉన్నాడు. బాలీవుడ్ నటులు జునైద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ ఆమెకు కజిన్స్.