bredcrumb

40 ప్లస్‌లోనూ నయనతార క్రేజ్‌.. లేడీ సూపర్ స్టార్ కి రికార్డు రెమ్యునరేషన్..

By Rajesh Karampoori
| Published: Monday, January 12, 2026, 18:27 [IST]

Nayanthara: 40 ప్లస్ వయసులోనూ నయనతార క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. లేడీ సూపర్ స్టార్‌గా నాలుగు భాషల్లో ఆమె మార్కెట్ పవర్ మరోసారి రుజువైంది.

Nayanthara
1/6

దక్షిణాది సినిమా పరిశ్రమలో 40 ఏళ్లు దాటినా క్రేజ్ ఏమాత్రం తగ్గని అరుదైన కథానాయికల్లో  నయనతార ఒకరు. వయసు పెరిగినా అందం, అభినయంతో పాటు మార్కెట్ విలువను నిలబెట్టుకుంటూ ఇప్పటికీ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. నాలుగు భాషల్లోనూ బిజీగా సినిమాలు చేస్తూ ‘లేడీ సూపర్ స్టార్’ ఇమేజ్‌ను మరింత బలపరుచుకుంటున్నారు.

Nayanthara
2/6

నయనతార సినీ ప్రయాణం కోలీవుడ్‌తో ప్రారంభమైనప్పటికీ, అక్కడే ఆమె కెరీర్ కీలక మలుపు తిరిగింది. శరత్ కుమార్‌తో తొలి అవకాశం, ఆపై  చంద్రముఖి, గజిని వంటి బ్లాక్‌బస్టర్లతో ఆమె స్టార్‌డమ్ స్థిరపడింది. ఆ తర్వాత తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో అవకాశాలు వెల్లువలా వచ్చాయి. బాలీవుడ్‌లో ‘జవాన్’ చిత్రంతోనూ భారీ విజయాన్ని అందుకున్నారు.

Nayanthara
3/6

41 ఏళ్ల వయసులోనూ వరుసగా సినిమాలు చేస్తూ నయనతార మార్కెట్ పవర్‌ను చాటుతున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో ‘చిరంజీవి’ సరసన నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లోనూ పాల్గొనడం సినీ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారి తీసింది. ఈ సినిమా కోసం రూ. 5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు టాక్. 

Nayanthara
4/6

ఇక కన్నడలో తెరకెక్కుతున్న  ‘టాక్సిక్’ సినిమా నయనతార రెమ్యునరేషన్ విషయంలో హాట్ టాపిక్‌గా నిలిచింది. రాకింగ్ స్టార్  ‘యష్’ హీరోగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం నయనతార రూ.18 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేశారనే ప్రచారం జరిగింది. చివరికి రూ.15 కోట్లకు ఒప్పుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది దక్షిణాదిలో హీరోయిన్లకు లభిస్తున్న టాప్ రెమ్యునరేషన్‌లలో ఒకటిగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Nayanthara
5/6

టాక్సిక్‌తో పాటు మలయాళంలో ‘పెట్రియడ్’, ‘డియర్ స్టూడెంట్’, తమిళంలో ‘మన్నాంగట్టి సిన్స్ 1960’, ‘రక్కయి’, ‘మూక్కుత్తి అమ్మన్ 2’ వంటి చిత్రాలు నయనతార చేతిలో ఉన్నాయి. అలాగే తెలుగులో బాలకృష్ణ సరసన మరో సినిమా చేసే అవకాశముందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇలా అన్ని భాషల్లోనూ బిజీగా ఉంటూనే, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో తన సత్తా చాటుతుండటం ఆమె ప్రత్యేకత.

Nayanthara
6/6

ఇలా  40 ప్లస్‌లోనూ నయనతార క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని, రెమ్యునరేషన్ పరంగా కూడా ఆమె టాప్ రేంజ్‌లోనే కొనసాగుతోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా, తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే ఎంపిక చేసుకుంటూ మార్కెట్‌ను నిలబెట్టుకోవడం నయనతారను ఇతరుల నుంచి వేరు చేస్తోంది. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+