పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓజీ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక మోహన్‌కు స్టార్ స్టేటస్ వచ్చేసింది. ఆమె తీయబోయే సినిమాలకు క్రేజ్ ఏర్పడింది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు ప్రియాంక మోహన్.


Click it and Unblock the Notifications
స్టార్ హీరోయిన్ ప్రియాంక మోహన్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా చీరలో ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓజీ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక మోహన్‌కు స్టార్ స్టేటస్ వచ్చేసింది. ఆమె తీయబోయే సినిమాలకు క్రేజ్ ఏర్పడింది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు ప్రియాంక మోహన్.
నానీస్ గ్యాంగ్ లీడర్‌తో తెలుగు వారిని పలకరించారు ప్రియాంక మోహన్. ఆ తర్వాత శర్వానంద్ సరసన శ్రీకారం, సరిపోదా శనివారం తదితర చిత్రాలలో నటించారు. తమిళ చిత్ర పరిశ్రమపైనా ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. శివకార్తీకేయన్‌తో తమిళ తెరపై అడుగుపెట్టారు. ఈమె అందానికి తమిళ తంబీలు ఫిదా కావడంతో అక్కడా అవకాశాలు వచ్చాయి.
ప్రస్తుతం తమిళంలో కావిన్, మేడిన్ కొరియా.. కన్నడంలో 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ సినిమాలలో నటిస్తున్నారు. ఇక ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేసేందుకు రా కార్తీక్ ప్లాన్ చేశారు. కింగ్ అక్కినేని నాగార్జునతో 100వ సినిమా చేస్తున్నారు కార్తీక్. ఫిమేల్ సెంట్రిక్ కథతో సినిమా ఉంటుందని కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.
అందరు హీరోయిన్ల మాదిరిగానే ప్రియాంక మోహన్ మీద కూడా పలు గాసిప్స్ వచ్చాయి. తమిళ నటుడు జయం రవితో ప్రియాంక రిలేషన్‌లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఇద్దరూ పెళ్లి బట్టల్లో, దండలు మార్చుకుని కనిపించడం వీటికి మరింత బలం చేకూర్చాయి. అయితే తమ మధ్య అలాంటి రిలేషన్ లేదని జయం రవి, ప్రియాంక క్లారిటీ ఇచ్చారు.
సినిమాలు, షూటింగ్స్, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడిపే ప్రియాంక.. ఖాళీ సమయాలలో విహార యాత్రలకు వెళ్తూ ఉంటుంది. కొత్త కొత్త ప్రదేశాలు తిరుగుతూ వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు ప్రియాంక. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.