bredcrumb

వైట్ డ్రెస్‌లో పాలరాతి శిల్పం.. రొమాంటిక్ ఫోజుల్లో ప్రణీత సుభాష్!

By Siva Kodati
| Published: Saturday, February 7, 2026, 21:50 [IST]

హీరోయిన్ ప్రణీత సుభాష్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది

Pranitha Subhash Photos
1/5

అత్తారింటికి దారేదిలో బాపుగారి బొమ్మగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఆడిపాడిన ప్రణీత సుభాష్‌కు ఆ తర్వాత టైం కలిసిరాలేదు. ఎన్నో ఆశలతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఒకటి అరా సినిమాలు చేసి ఇక వర్కవుట్ కాదని గ్రహించి పెళ్లి చేసుకుని సెటిలైపోయింది.

Pranitha Subhash Photos
2/5

కర్ణాటకకు చెందిన ప్రణీత సుభాష్.. కన్నడ ఇండస్ట్రీలో తొలుత అదృష్టం పరీక్షించుకుంది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ నుంచి కబురు రావడంతో ఇక్కడ వాలిపోయింది. పవన్ కళ్యాణ్‌తో అత్తారింటికి దారేది, మహేశ్ బాబుతో బ్రహ్మోత్సవం, ఎన్టీఆర్‌తో రభస వంటి సినిమాలు చేసింది. 

Pranitha Subhash Photos
3/5

స్టార్ హీరోల పక్కన నటించినప్పటికీ అవన్నీ సెకండ్ లీడ్ కావడంతో ప్రణీతకు ఆ తర్వాత అవకాశాలు అంతంత మాత్రంగానే దక్కాయి. పరిస్ధితులు ఏమాత్రం సహకరించకపోవడంతో తమిళ్, హిందీతో పాటు తన మాతృభాష కన్నడంలో కొన్ని సినిమాలు చేసింది. అయినప్పటికీ ప్రణీతకు కాలం కలిసిరాలేదు.

Pranitha Subhash Photos
4/5

అవకాశాలు తగ్గుతున్న దశలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను కరోనా లాక్‌డౌన్ సమయంలో పెళ్లాడింది. ఈ దంపతులకు ఓ బాబు, పాప సంతానం. ప్రస్తుతం భర్త, పిల్లలు, కుటుంబంతో గడుపుతూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ప్రణీత సుభాష్. అయితే మంచి ప్రాజెక్ట్‌ అందుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ప్రణీత గట్టి పట్టుదలతో ఉంది. 

Pranitha Subhash Photos
5/5

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రణీత సుభాష్.. తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలపై స్పందిస్తూ ఉంటారు. అలాగే హాట్ హాట్ ఫోటోషూట్‌లతో కుర్రకారును రెచ్చగొడుతుంటారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా, 40కి దగ్గరవుతున్నా ప్రణీత అందాలు ఏమాత్రం తగ్గలేదు. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+