bredcrumb

దేవ‌క‌న్య‌లా మెరిసిపోతున్న దేసి గర్ల్.. వారణాసి ఈవెంట్లోప్రియాంక చోప్రా ..

By Rajesh Karampoori
| Published: Sunday, November 16, 2025, 18:51 [IST]

Priyanka Chopra: రాజమౌళి – మహేశ్ బాబు ‘వారణాసి’ మూవీ గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా లుక్ సెగలు రేపింది. తెల్లటి లెహెంగా దుస్తుల్లో రాణిలా మెరిసింది. ప్రసుత్తం ప్రియాంక ఫొటోలు సోషల్ మీడియాలో  వైరలవుతున్నాయి.

Priyanka Chopra
1/6

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ‘గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్’ ప్రశంసలు కురిపిస్తోంది. ఎస్.ఎస్. రాజమౌళి – మహేశ్ బాబు భారీ పాన్-వరల్డ్ మూవీ ‘వారణాసి’ టైటిల్ రివీల్‌తో కూడిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖుల సందడి కనిపించింది. అయితే అందరి దృష్టి ఆకర్షించిన వ్యక్తి… గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.

Priyanka Chopra
2/6

ఈవెంట్‌లోకి ప్రవేశించిన వెంటనే ప్రియాంక తెలుగు అభిమానులకు చేతులెత్తి “నమస్కారం” చెప్పడం ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచింది. “ప్రియాంక రాణిలా ఉంది”, “దేసీ గర్ల్ లెవెల్ ఎప్పటికీ డౌన్ కాదు” అంటూ కామెంట్స్ వెల్లువెత్తాయి. ప్రియాంక లుక్ ఒక్కరోజులోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

Priyanka Chopra
3/6

వారణాసి సినిమాలో ‘మందాకిని’ పాత్రలో ప్రియాంక కనిపించబోతున్నారు, మహేష్ బాబు ‘రుద్ర’గా నటిస్తున్నారు. రాజమౌళి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ – “ప్రపంచ వేదికపై భారతీయ సినిమాకు కొత్త నిర్వచనం ఇచ్చిన మహిళ… తిరిగి స్వాగతం ప్రియాంక చోప్రా జోనాస్” అని ప్రశంసించారు.

Priyanka Chopra
4/6

ఇవేంట్లో ప్రియాంక మాట్లాడిన మాటలు కూడా వైరల్ అయ్యాయి. ఆమె తన స్పీచ్‌ని మహేష్ బాబు డైలాగ్‌తో ప్రారంభించి, తొలిసారిగా తెలుగులో మాట్లాడుతూ అభిమానుల్ని సర్ప్రైజ్ చేసింది. “ తనకు స్వాగతం ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు” అని చెప్పి ఫ్యాన్స్ హృదయాలు గెలుచుకుంది.

Priyanka Chopra
5/6

ఈవెంట్ ప్రొమోషన్ల కోసం ప్రియాంక అందమైన ఫోటోషూట్ కూడా చేసింది. వైట్ లెహెంగా, హెవీ జువెల్లరీతో చేసిన ఆమె లుక్‌ను చూసి నెటిజన్లు “ఇలా సంప్రదాయ లుక్‌లో ప్రియాంకను చూసి చాలా రోజులయ్యింది”, “ఇది నిజంగా రాయల్ రీఎంట్రీ” అంటూ కామెంట్ చేస్తున్నారు.

Priyanka Chopra
6/6

ప్రియాంక ఎంట్రీతో వారణాసి సినిమా హైప్ మరింత పెరిగింది. రాజమౌళి – మహేష్ బాబు కాంబోపై ఇప్పటికే ప్రపంచ దృష్టి ఉండగా, ఇప్పుడు ప్రియాంక రాణిలా అడుగు పెట్టడంతో ఈ ప్రాజెక్ట్‌కు గ్లోబల్ ఆకర్షణ రెట్టింపు అయ్యింది.

X