bredcrumb

కస్సుమనే అందాలతో రచ్చ చేస్తున్న రకుల్..

By Rajesh Karampoori
| Published: Wednesday, November 19, 2025, 19:13 [IST]

Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా బీచ్‌లో రచ్చ చేసింది.ఈ సమయంలో బీచ్‌లో చేసిన ఈ ఫోటోషూట్‌లో ఆమె ప్రత్యేకంగా ఎద అందాలను హైలైట్‌ చేసే రొమాంటిక్ స్టిల్స్ పెట్టడం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆమె లెటెస్ట్ ఫోటోలపై ఓ లూక్కేయండి. 

Rakul Preet Singh
1/6

బాలీవుడ్, టాలీవుడ్‌లలో మెరిసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత కూడా తన గ్లామర్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంది. తాజాగా బీచ్‌లో చేసిన ఫోటోషూట్‌తో రకుల్ సోషల్ మీడియాను షేక్ చేసింది. హాట్ లుక్‌తో కనిపించిన ఆమె తాజా ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ఆమె పోస్ట్ చేసిన ప్రతి ఫోటోపై అభిమానులు ఫిదా అవుతూ కామెంట్లు కురిపిస్తున్నారు.

Rakul Preet Singh
2/6

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన చిత్రం ‘కెరటం’, ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన నితిన్‌తో ‘హార్ట్ ఎటాక్’ ఆమెకు భారీ గుర్తింపు తెచ్చింది. అనంతరం ‘లౌక్యం’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలతో స్టార్ హీరోల సరసన నెంబర్ వన్ రేంజ్‌లో నిలిచింది. తెలుగులో రకుల్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

Rakul Preet Singh
3/6

ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఆఫర్లు తగ్గినా రకుల్ బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. హిందీలో వరుస సినిమాలతో బిజీగా మారిన ఆమె, పెళ్లి తర్వాత కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూనే ఉంది. 

Rakul Preet Singh
4/6

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ జంట 2024 ఫిబ్రవరి 21న గోవాలో ఎకో–ఫ్రెండ్లీ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వారి వెడ్డింగ్ ఫోటోలు వైరల్ అయ్యాయి. 

Rakul Preet Singh
5/6

రకుల్ ఆస్తుల విషయానికి వస్తే.. హైదరాబాద్, విశాఖపట్నంలో మూడు జిమ్‌లు, కోట్లు విలువైన కార్లు: మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ 520డీ, ఆడి Q3, మెర్సిడెస్ మేబాక్ GLS600 లాంటి లగ్జరీ వాహనాలు ఉన్నాయి. మొత్తం ఆమె ఆస్తులు రూ. 50 కోట్ల పైగా ఉన్నట్లు సమాచారం.

Rakul Preet Singh
6/6

పెళ్లి తరువాత కూడా రకుల్ స్టైల్, గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ కొత్త ఫోటోషూట్లు, ఫిట్‌నెస్ వీడియోలు, ట్రావెల్ క్లిక్స్ షేర్ చేస్తూ రకుల్ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తోంది.

X