bredcrumb

Shalini Pandey: అర్జున్ రెడ్డి బ్యూటీ బికినీ ట్రీట్.. తడిసిన అందాల్లో అదిరింది..

By Rajesh Karampoori
| Published: Saturday, February 7, 2026, 19:44 [IST]

Shalini Pandey: అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే లేటెస్ట్ బికినీ ఫోటోలు వైరల్. బోల్డ్ బీచ్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న షాలిని. మీరు కూడా ఓ లూక్కేయండి. 

Shalini Pandey
1/6

ఒకప్పటి అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆమె షేర్ చేసిన వెకేషన్ బికినీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. వెండితెరపై ఎక్కువగా పద్ధతైన పాత్రల్లో కనిపించే షాలిని, సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తన బోల్డ్ సైడ్ చూపిస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంటుంది.

Shalini Pandey
2/6

అర్జున్ రెడ్డి తో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచిన షాలిని, ఈ మూవీతోనే స్టార్‌డమ్ అందుకుంది. ఆ తర్వాత నటనతో పాటు గ్లామర్ పరంగానూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా బీచ్ వద్ద టూ-పీస్ బికినీలో ఇచ్చిన పోజులు ఆమె కాన్ఫిడెన్స్, ఫిట్‌నెస్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Shalini Pandey
3/6

ఈ ఫోటోలు షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వేలల్లో లైక్స్, కామెంట్స్ వచ్చాయి. “బ్యూటీ అండ్ బోల్డ్ కాంబినేషన్”, “అర్జున్ రెడ్డి హీరోయిన్ మేకోవర్ అదిరిపోయింది” అంటూ అభిమానులు స్పందిస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత స్లిమ్‌గా కనిపిస్తున్న షాలినీ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Shalini Pandey
4/6

కెరీర్ విషయానికి వస్తే… అర్జున్ రెడ్డి తర్వాత ఆమె మహానటి, 118 వంటి సినిమాల్లో నటించింది. ఆపై బాలీవుడ్ వైపు అడుగులు వేసి రణ్‌వీర్ సింగ్ సరసన జయేశ్ భాయ్ జోర్దార్లో కనిపించినా పెద్ద బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

Shalini Pandey
5/6

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్లను ఎంచుకుంటూ ముందుకెళ్లాలని షాలిని భావిస్తోంది. అయితే అర్జున్ రెడ్డి తర్వాత ఆమెకు అదే స్థాయి హిట్ దక్కకపోవడంతో, మధ్యలో అవకాశాలు కూడా తగ్గాయి. అందుకే ఇటీవల ఫోటోషూట్లతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

Shalini Pandey
6/6

మొత్తానికి… తాజా బికినీ ఫోటోలతో మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చిన షాలిని పాండే, త్వరలోనే ఓ కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. ఈ గ్లామర్ హంగామా ఆమె కెరీర్‌కు కొత్త ఊపు తీసుకువస్తుందా? అన్నది చూడాలి.

X