bredcrumb

Triptii Dimri: ఆలస్యమైనా గెలుపు నాదే... తృప్తి దిమ్రి ఎమోషనల్ పోస్ట్

By Siva Kodati
| Published: Wednesday, January 28, 2026, 21:29 [IST]

స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ తృప్తి దిమ్రి లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా తృప్తి దిమ్రి స్టైలీష్ లుక్‌లో జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.

Triptii Dimri Photos
1/5

వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు నేషనల్ క్రష్ తృప్తి దిమ్రి. అంతకుముందే ఎన్నో సినిమాలు చేసినా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమాతో నేషనల్ వైడ్ పాపులారిటీ దక్కించుకున్నారు తృప్తి. ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించారు.

Triptii Dimri Photos
2/5

యానిమల్ తర్వాత బాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ భూలయా 3, ఢడక్ 2 సినిమాలో నటించారు తృప్తి. ప్రస్తుతం ఓ రోమియో, మా బెహన్ సినిమాలలో నటిస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. కెరీర్‌లో తొలిసారిగా తెలుగు సినిమాలో నటిస్తున్నారు తృప్తి. అదే స్పిరిట్. 

Triptii Dimri Photos
3/5

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఇందులో ఒళ్లంతా గాయాలతో షర్ట్ లేకుండా ప్రభాస్ నిలబడి ఉండగా.. అతనికి లైటర్‌తో సిగరెట్ వెలిగిస్తూ అందంతో మెరిసిపోయింది తృప్తి.

Triptii Dimri Photos
4/5

అయితే తనకు ఈ పాపులారిటీ రాత్రికి రాత్రి రాలేదు. దీని వెనుక ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఉన్నాయి. ఇండస్ట్రీలోకి వెళ్తానంటే ఇంట్లో వాళ్లు భయపడ్డారని.. కానీ తానే ధైర్యం చేసి ముంబైకి వచ్చానని, ఇక్కడ ఒకే గదిలో దాదాపు 50 మందితో కలిసి నివసించానని ఆమె ఎన్నో ఇంటర్వ్యూలలో తెలిపారు.

Triptii Dimri Photos
5/5

ప్రతిరోజూ ముంబైలో తిరుగుతూ అవకాశాల కోసం ప్రయత్నించానని.. అవకాశాలు లేక బాధపడ్డానని, అయినప్పటికీ తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లకూడదని నొప్పిని పంట బిగువున భరించానని దిమ్రీ చెప్పారు. చివరికి తన కష్టం, క్రమశిక్షణతో అనుకున్నది సాధించి నేషనల్ క్రష్ అనిపించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. 

X