bredcrumb

ఎన్ని జన్మలైనా నువ్వే అమ్మగా కావాలి.. తల్లి బర్త్ డే వేడుకలలో శ్రీలీల ఎమోషనల్

By Siva Kodati
| Published: Wednesday, February 4, 2026, 20:45 [IST]

శ్రీలీల లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ఆ ఫోటోలు మీకోసం

Sreeleela Photos
1/5

వెండితెరపై వేగంగా దూసుకొచ్చి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు శ్రీలీల. చిన్న వయసులోనే పీక్స్ చూస్తున్నారు. వరుసపెట్టి అగ్రహీరోల సరసన ఆఫర్లు అందుకుంటున్నారు. ఫ్లాప్‌లు వచ్చినప్పటికీ శ్రీలీల కెరీర్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అంతకుమించి అనేలా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. 

Sreeleela Photos
2/5

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని ఎంతోమంది నటీమణులు చెబుతుంటారు. కానీ డాక్టర్ చదివి యాక్టర్ అయిన వారు అరుదు. ఈ కోవలోకే వస్తారు శ్రీలీల. చిన్న వయసులోనే సూపర్‌స్టార్ మహేశ్ బాబు, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్రనటుల సరసన నటించే అవకాశాలు అందుకున్నారంటే అందుకు శ్రీలీల అదృష్టమే కారణమని చెప్పొచ్చు.

Sreeleela Photos
3/5

గుంటూరు కారంతో హిట్ అందుకున్న శ్రీలీల.. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసి ఈ బ్లాక్‌బస్టర్ హిట్‌లో తన వంతు పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత శ్రీలీల చేసిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. రాబిన్‌హుడ్, జూనియర్, మాస్ జాతర, పరాశక్తి ఇలా ఒకదాని తర్వాత మరొకటి బోల్తా కొడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్, హిందీలో అనురాగ్ బసు సినిమాలలో శ్రీలీల నటిస్తున్నారు.

Sreeleela Photos
4/5

తాజాగా శ్రీలీల తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. తల్లికి బర్త్ డే వేడుకలు నిర్వహించిన ఆమె.. మాతృమూర్తితో గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను శ్రీలీల సోషల్ మీడియాలో షేర్ చేశారు. చివరిలో తల్లి సింహం ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్న ఫోటోను పెట్టి కలకలం రేపారు. అలాగే తల్లికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 

Sreeleela Photos
5/5

పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా.. 24 గంటలూ వినోదం, 365 రోజులూ ఎమోషనల్ సపోర్ట్. నిత్యజీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు నిస్వార్ధ ప్రేమ నిజంగా ఎలా ఉంటుందో నేను చూస్తున్నాను. మనం పంచుకునే విషయాలంటే నాకు చాలా ఇష్టం.. నువ్వు నాకు ధైర్యంగా ఉండటం నేర్పిస్తావు, నేను నీకు కొద్దిపాటి తెలివితేటలో తుఫానులను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాను. వచ్చే అన్ని జన్మలలోనూ నువ్వే నా అమ్మగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను సృష్టించినందుకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది శ్రీలీల

X