bredcrumb

Sreeleela: స్టానింగ్ లుక్స్ తో మత్తెక్కిస్తున్న శ్రీలీల.. అందాల ఆరబోత

By Rajesh Karampoori
| Published: Sunday, January 18, 2026, 20:04 [IST]

Sreeleela: స్టార్ హీరోయిన్ శ్రీలీల తాజా ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టైలిష్ లుక్‌లో ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌గా మారాయి. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.

Sreeleela’s latest photoshoot
1/6

ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో శ్రీలీల (Sreeleela) ఒకరు.  కుర్ర హీరోల నుంచి సీనియర్ స్టార్‌ల వరకు అందరూ ఆమెతో పనిచేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందం, అభినయం,డ్యాన్స్  ఈ మూడు కలిపి శ్రీలీలను తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్‌గా నిలబెట్టాయి. ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే ఆమె టాలీవుడ్‌లో అగ్ర నాయికల సరసన నిలిచిపోయింది.

Sreeleela’s latest photoshoot
2/6

‘పెళ్లి సందడి’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన శ్రీలీల మొదటి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘ధమాకా’ మూవీ ఆమె కెరీర్‌కి భారీ టర్నింగ్ పాయింట్ అయింది. రవితేజ సరసన నటించిన ఈ సినిమాలో ఆమె డ్యాన్స్, గ్లామర్, ఎనర్జీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. 

Sreeleela’s latest photoshoot
3/6

‘ధమాకా’ విజయంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆమె నటించిన ‘స్కంద’, ‘గుంటూరు కారం’ సినిమాల్లో నటించింది.  అంతేకాకుండా  అల్లు అర్జున్  ‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్‌తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ప్రతి సినిమాలో ఆమె యూత్‌ఫుల్ ఎనర్జీ, క్యూట్  ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేస్తున్నాయి.

Sreeleela’s latest photoshoot
4/6

తాజాగా రవితేజతో నటించిన ‘మాస్ జాతర’ సినిమాలో శ్రీలీల శ్రీకాకుళం యాసలో తులసిగా మెరిసారు. పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో హీరోయిన్‌గా నటించడం ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా భావిస్తున్నారు. తమిళంలో ‘పరాశక్తి’ ప్రాజెక్ట్‌తో కూడా దూసుకెళ్తున్నారు.

Sreeleela’s latest photoshoot
5/6

 ఇంతలోనే శ్రీలీల బాలీవుడ్ వైపు కూడా దృష్టి పెట్టింది. అనురాగ్ బసు దర్శకత్వంలో ‘అషికీ 3’ లో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా సెట్ అవ్వడంతో, బాలీవుడ్‌లో వీరి మధ్య డేటింగ్ రూమర్స్ కూడా హాట్ టాపిక్‌గా మారాయి. అయితే శ్రీలీల ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

Sreeleela’s latest photoshoot
6/6

సినిమా కెరీర్‌తో పాటు సమాజ సేవలోనూ శ్రీలీల ముందుంది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆమె ఇద్దరు అనాథ పిల్లలను దత్తత తీసుకుని చదువు, సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ట్రడిషనల్ చీర ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అందం, అభినయం, మంచి మనసు ఈ మూడు కలిపి శ్రీలీలను టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా మార్చేశాయి.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+