bredcrumb

అందాలు ఆరబోస్తున్న స్టార్ యాంకర్.. చీరకట్టుతో కుర్రాళ్లకు కిక్కెక్కిస్తోన్న శ్రీముఖి

By Rajesh Karampoori
| Published: Saturday, January 24, 2026, 19:02 [IST]

Sreemukhi: స్టార్ యాంకర్ శ్రీముఖి తాజా చీర ఫొటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భోళా శంకర్, మా ఇంటి బంగారం సినిమాలతో పాటు యాంకరింగ్‌లోనూ క్రేజ్ సంపాదించిన శ్రీముఖి లేటెస్ట్ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Sreemukhi latest photos
1/6

తెలుగులో టాప్ యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనదైన మాట తీరు, ఎనర్జిటిక్ ప్రెజెంటేషన్‌తో బుల్లితెర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే ఆమె, యాంకరింగ్‌తో పాటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్‌ను బ్యాలెన్స్‌గా ముందుకు తీసుకెళ్తోంది. తక్కువ సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకోవడంలో ఆమె సక్సెస్ అయ్యారు.

Sreemukhi latest photos
2/6

టాలీవుడ్‌లో అగ్ర హీరోల సినిమాల్లో కనిపించి తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవి–శ్రీముఖి మధ్య వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన  ఖుషి లోని ఫేమస్ సీన్‌ను చిరంజీవితో కలిసి రీక్రియేట్ చేయడం కూడా ఆమె కెరీర్‌లో హైలైట్‌గా నిలిచింది.

Sreemukhi latest photos
3/6

అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే… శ్రీముఖి అసలు లక్ష్యం హీరోయిన్ కావడమే. ప్రేమ ఇష్క్ కాదల్ తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఆమెకు ఆ తర్వాత హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో బ్రేక్ రాకపోవడంతో బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

Sreemukhi latest photos
4/6

నిజామాబాద్‌కు చెందిన శ్రీముఖి, 2010లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లూ అర్జున్ నటించిన  జులాయి లో బన్నీ చెల్లిగా కనిపించి మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నేను శైలజ లో రామ్ పోతినేని అక్కగా నటించడం, అలాగే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేయడం జరిగింది.

Sreemukhi latest photos
5/6

కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శ్రీముఖి, ఇప్పుడు మళ్లీ బిగ్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. సమంత నటిస్తున్న  మా ఇంటి బంగారం లో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో శ్రీముఖి లుక్ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. దీంతో యాంకర్ నుంచి నటిగా మరోసారి తన సత్తా చాటేందుకు శ్రీముఖి సిద్ధమవుతోందన్న చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది.

Sreemukhi latest photos
6/6

సినిమాలతో పాటు శ్రీముఖి సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటుంది. ట్రెడిషనల్ నుంచి మోడ్రన్ వరకు విభిన్న లుక్స్‌లో ఫోటోషూట్లు చేస్తూ ట్రెండ్స్ క్రియేట్ చేస్తుంది. తాజాగా రంగురంగుల చీరలో చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, “ రెడ్ కలర్స్ శారీ” అంటూ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. 

X