bredcrumb

Tamannaah: బ్రేకప్‌పై తమన్నా షాకింగ్ కామెంట్స్.. అందుకే దూరం అంటూ..

By Rajesh Karampoori
| Published: Tuesday, January 27, 2026, 20:14 [IST]

Tamannaah Bhatia: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రేమ, బ్రేకప్స్, ‘డేంజరస్ రిలేషన్’పై చేసిన ఎమోషనల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Tamannaah Bhatia
1/6

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న తమన్నా, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ప్రేమ, బ్రేకప్‌ల విషయంలో మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటారు. ముఖ్యంగా నటుడు విజయ్ వర్మ తో సాగిన ప్రేమాయణం, ఆ తర్వాత జరిగిన బ్రేకప్ అందరికీ తెలిసిందే.

Tamannaah Bhatia
2/6

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా తన ప్రేమ జీవితంపై చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి. ఇంటర్వ్యూలో తమన్నా తన జీవితంలో రెండు సార్లు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వెల్లడించారు. “నేను టీనేజ్‌లో ఉన్నప్పుడే మొదటిసారి ప్రేమలో పడ్డాను. కానీ నా లక్ష్యాలు, కెరీర్ ముందు ఆ బంధం నిలవలేదు. నా భవిష్యత్తు కోసం ఆ రిలేషన్‌షిప్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది” అని ఆమె చెప్పారు. అప్పట్లో కెరీర్‌కు ప్రాధాన్యం ఇవ్వడమే సరైన నిర్ణయమని భావించానని కూడా తెలిపారు.

Tamannaah Bhatia
3/6

మొదటి బ్రేకప్ తర్వాత మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నానని, కానీ అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైందని తమన్నా ఓపెన్‌గా చెప్పారు. “కొంతకాలానికి అతడు నాకు సరైన వ్యక్తి కాదని అర్థమైంది. అలాంటి బంధాన్ని కొనసాగించడం ప్రమాదకరం అని గ్రహించి బయటకు వచ్చాను” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మాటలు విజయ్ వర్మనే ఉద్దేశించి చెప్పిందా అనే సందేహాలు మొదలయ్యాయి.

Tamannaah Bhatia
4/6

తమన్నా - విజయ్ వర్మ ప్రేమాయణం లస్ట్ స్టోరీస్ 2 సెట్స్‌లో మొదలైందనే ప్రచారం అప్పట్లో బీటౌన్‌ను ఊపేసింది. ఆ సిరీస్‌లోని లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్స్ తర్వాత వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఈవెంట్స్‌కు కలిసి హాజరవడం, ఫోటోషూట్స్ చేయడం చూసి త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా వీరి బంధానికి బ్రేక్ పడింది.  

Tamannaah Bhatia
5/6

ఈ నేపథ్యంలో తమన్నా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ పాత రూమర్లను మళ్లీ తెరపైకి తెచ్చాయి. ‘ప్రేమ కంటే ఆత్మగౌరవం, కెరీర్ ముఖ్యం” అన్న ఆమె మాటలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో “తమన్నా బోల్డ్ డెసిషన్”, “ఇలాంటి హీరోయిన్లు స్ఫూర్తి” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో “డేంజర్ అన్న వ్యక్తి విజయ్ వర్మేనా?” అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

Tamannaah Bhatia
6/6

కెరీర్ పరంగా చూస్తే, తమన్నా ఇప్పటికీ ఫుల్ బిజీగానే ఉన్నారు. గతేడాది ‘ఓదెల 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ఓటీటీతో పాటు కమర్షియల్ సినిమాలపై దృష్టి పెట్టారు. కోలీవుడ్‌లో విశాల్ హీరోగా నటిస్తున్న ‘పురుషన్’ (తెలుగులో ‘మొగుడు’)లో కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్‌లో అజయ్ దేవగన్, సంజయ్ దత్ నటిస్తున్న ‘రేంజర్’ సినిమాలోనూ తమన్నా భాగమయ్యారు. ప్రేమలో చేదు అనుభవాలు ఎదురైనా, కెరీర్ విషయంలో మాత్రం తమన్నా తన దూకుడును ఏమాత్రం తగ్గించలేదు.

X