bredcrumb

బాహుబలి రోజులను గుర్తుచేసుకున్న తమన్నా... గుర్రంతో మిల్కిబ్యూటీ

By Siva Kodati
| Published: Sunday, January 18, 2026, 20:55 [IST]

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది.

Tamannaah Bhatia Photos
1/5

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. సెల్యూలాయిడ్‌పై ఆవిష్కరించిన అపూర్వ దృశ్య కావ్యం. ఈ సినిమాతో పాన్ ఇండియా కల్చర్‌కు పునాదిపడగా.. ఈ మూవీలో నటించిన వారంతా పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. 

Tamannaah Bhatia Photos
2/5

బాహుబలిలో నటించిన నటీనటులంతా తమ పాత్రల్లో జీవించారు. ప్రజలు వారి పేర్లను కాకుండా పాత్రల పేరుతో పిలుస్తున్నారంటే వారు వేసిన ముద్రను అర్ధం చేసుకోవచ్చు. ఇందులో అవంతిక పాత్ర పోషించారు తమన్నా భాటియా. పాలరాతి శిల్పం లాంటి అందంతో మెరిసిపోతూ గ్లామరస్ రోల్స్‌కు కేరాఫ్‌గా నిలిచే తమన్నా.. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్‌తో పాటు కత్తి పట్టుకుని యుద్ధాలు చేసింది. 

Tamannaah Bhatia Photos
3/5

మహేంద్ర బాహుబలికి ప్రియురాలిగా తమన్నా అద్భుతంగా నటించారు. అయితే బాహుబలి పార్ట్ 1లో పచ్చబొట్టు వేసిన పిల్లగాడా సాంగ్‌లో ప్రభాస్, తమన్నాల మధ్య రొమాంటిక్ సన్నివేశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మితిమీరిన రొమాన్స్ కనిపించిందంటూ దర్శకుడు రాజమౌళితో పాటు ప్రభాస్, తమన్నాలపై ట్రోలింగ్ జరిగింది. అయితే దీనికి అదే స్థాయిలో సమాధానం చెప్పింది చిత్ర యూనిట్.

Tamannaah Bhatia Photos
4/5

బాహుబలి విడుదలైన దాదాపు పదేళ్ల తర్వాత ఈ వివాదంపై తమన్నా ఘాటుగా స్పందించారు. రాజమౌళి అసలు ఆ సీన్లు ఎందుకు తీశారు? దాని వెనుక దర్శకుడి విజన్ ఏమిటీ? అన్న దానిపై మిల్కీబ్యూటీ క్లారిటీ ఇచ్చారు. రొమాన్స్‌ను కూడా నీచమైన స్థాయికి చూసేలా కొందరు దిగజారిపోయారని తమన్నా మండిపడ్డారు. మంచి విషయాన్ని కూడా తప్పుడు దృష్టితో చూస్తున్నారని సీరియస్ అయ్యారు. 

Tamannaah Bhatia Photos
5/5

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా తమన్నా భాటియా.. తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలపై ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా బాహుబలి 2 రోజులను గుర్తుచేసుకున్నారు మిల్కీబ్యూటీ. అలాగే గుర్రపు స్వారీ కోసం తాను తీసుకున్న క్లాసులను తెలియజేస్తూ గుర్రంతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+