bredcrumb

Tamannaah Bhatia: గ్లామర్ ఫోటోలతో మతి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ.. ఆ అందాలను చూస్తే..

By Rajesh Karampoori
| Published: Friday, January 23, 2026, 21:23 [IST]

Tamannaah Bhatia: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వరుస హిట్ సినిమాలతో ఆమె ఇండస్ట్రీలో దూసుకుపోతోంది.

Tamannaah Bhatia latest Photos
1/6

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మిక్కీ బ్యూటీ భాషతో సంబంధం లేకుండా పలు సినిమాల్లో నటిస్తుంది. సిని ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఓటీటీలో కూడా అగుడుపెట్టి తన సత్తా చాటుకుంది.

Tamannaah Bhatia latest Photos
2/6

మంచు మనోజ్ హీరోగా వచ్చిన 'శ్రీ' అనే మూవీతో తెలుగు సినిమాకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తరువాత శేఖర్ కమలా డైరెక్షన్ లో వచ్చిన 'హ్యాపీ డేస్' అనే మూవీతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ హిట్ తో అప్పటినుంచి ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇండస్ట్రీలో దూసుకుపోయింది.

Tamannaah Bhatia latest Photos
3/6

బాలీవుడ్‌, దక్షిణాది సినిమాల విషయంలో తమన్నా భాటియా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కే లవ్ అండ్ వార్, క్రూ 2, గోల్‌మాల్ 5, మ్యాడాక్ సంస్థ హారర్–కామెడీ యూనివర్స్ చిత్రాల్లో ఆమె నటించవచ్చని ప్రచారం జరుగుతున్నా, ఇవేవీ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.

Tamannaah Bhatia latest Photos
4/6

ఇదే సమయంలో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న నాగ్‌జిల్లా సినిమా నుంచి డేట్స్ సమస్యల కారణంగా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్లాలనే వ్యూహంలో భాగమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Tamannaah Bhatia latest Photos
5/6

2026లో విడుదల కానున్న చిత్రాల పరంగా తమన్నా బాలీవుడ్‌లో బిజీగా ఉండనుంది. షాహిద్ కపూర్‌తో రోమియో, సిద్ధార్థ్ మల్హోత్రాతో వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ద ఫారెస్ట్, జాన్ అబ్రహామ్ నటించే రాకేశ్ మారియా బయోపిక్‌లో కీలక పాత్రలు చేయనుంది. తమిళంలో విశాల్‌తో ఓ సినిమా చేస్తుండగా, అది తెలుగులో మొగుడు పేరుతో విడుదల కానుంది.

Tamannaah Bhatia latest Photos
6/6

ఇక దక్షిణాదిలో దాదాపు ఏడు తెలుగు–తమిళ సినిమాలను ఆమె తిరస్కరించినట్లు సమాచారం. కారణం ఒక్కటే “ఫ్లవర్‌పాట్ పాత్రలు వద్దు” అనే నిర్ణయం. ఈ నేపథ్యంలో జైలర్ 2లో ఆమె పాత్ర కూడా అనిశ్చితంగా మారిందని టాక్. మొత్తంగా, పాత్రల ఎంపికలో మార్పు తీసుకొస్తున్న తమన్నా నిర్ణయం, ఆమె కెరీర్‌కు కొత్త ఊపునివ్వవచ్చని అభిమానులు భావిస్తున్నారు.

X