తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో తన సత్తా చాటుతోంది. కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే రూ. వందల కోట్లను వసూలు చేస్తోంది. బాహుబలి నుంచి దేవర వరకు ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సత్తా చాటిన టాప్ 10 తెలుగు సినిమాల వివరాలు
1/10
Tollywood's Top 10 Business : టాలీవుడ్‌లో టాప్ 10 ప్రీ రిలీజ్ మూవీ బిజినెస్.. బాహుబలి టూ దేవర | Top 10 Films With Highest Pre Release Business In Tollywood , Here's The Details - Filmibeat Telugu
/photos/feature/top-10-films-with-highest-pre-release-business-in-tollywood-heres-the-details-fb96194.html
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మూవీ ఆదిపురుష్. రామాయణాన్ని బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి సనన్ సీతమ్మ తల్లిగా నటించారు. మైథలాజికల్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగినట్లుగానే బిజినెస్ జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కింద ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి
2/10
Tollywood's Top 10 Business : టాలీవుడ్‌లో టాప్ 10 ప్రీ రిలీజ్ మూవీ బిజినెస్.. బాహుబలి టూ దేవర | Top 10 Films With Highest Pre Release Business In Tollywood , Here's The Details - Filmibeat Telugu
/photos/feature/top-10-films-with-highest-pre-release-business-in-tollywood-heres-the-details-fb96194.html#photos-1
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా కీలకపాత్రలు పోషించిన చిత్రం బాహుబలి 2. బాహుబలికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ.350 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాను రూ.190 కోట్లకు విక్రయించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.
3/10
Tollywood's Top 10 Business : టాలీవుడ్‌లో టాప్ 10 ప్రీ రిలీజ్ మూవీ బిజినెస్.. బాహుబలి టూ దేవర | Top 10 Films With Highest Pre Release Business In Tollywood , Here's The Details - Filmibeat Telugu
/photos/feature/top-10-films-with-highest-pre-release-business-in-tollywood-heres-the-details-fb96194.html#photos-2
కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ. 180 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ అని టాలీవుడ్ జనాలు అంటున్నారు.
4/10
Tollywood's Top 10 Business : టాలీవుడ్‌లో టాప్ 10 ప్రీ రిలీజ్ మూవీ బిజినెస్.. బాహుబలి టూ దేవర | Top 10 Films With Highest Pre Release Business In Tollywood , Here's The Details - Filmibeat Telugu
/photos/feature/top-10-films-with-highest-pre-release-business-in-tollywood-heres-the-details-fb96194.html#photos-3
మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ నటించిన కల్కి 2898 ఏడీ సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ. 385 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.180 కోట్లు, ఓవర్సీస్‌లో 70 కోట్లు, హిందీలో రూ.85 కోట్ల వ్యాపారం చేసిందని విశ్లేషకుల అంచనా.
5/10
Tollywood's Top 10 Business : టాలీవుడ్‌లో టాప్ 10 ప్రీ రిలీజ్ మూవీ బిజినెస్.. బాహుబలి టూ దేవర | Top 10 Films With Highest Pre Release Business In Tollywood , Here's The Details - Filmibeat Telugu
/photos/feature/top-10-films-with-highest-pre-release-business-in-tollywood-heres-the-details-fb96194.html#photos-4
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించిన పుష్ప ది రైజ్ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఐదు భాషల్లోని థియేట్రికల్ రైట్స్, శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ రైట్స్ ఇలా అన్ని కలిపి దాదాపు రూ.160 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా.
6/10
Tollywood's Top 10 Business : టాలీవుడ్‌లో టాప్ 10 ప్రీ రిలీజ్ మూవీ బిజినెస్.. బాహుబలి టూ దేవర | Top 10 Films With Highest Pre Release Business In Tollywood , Here's The Details - Filmibeat Telugu
/photos/feature/top-10-films-with-highest-pre-release-business-in-tollywood-heres-the-details-fb96194.html#photos-5
ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్.. ప్రభాస్‌ను కంప్లీట్ డిఫరెంట్‌గా చూపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.107 కోట్ల వ్యాపారం చేసి ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది.
7/10
Tollywood's Top 10 Business : టాలీవుడ్‌లో టాప్ 10 ప్రీ రిలీజ్ మూవీ బిజినెస్.. బాహుబలి టూ దేవర | Top 10 Films With Highest Pre Release Business In Tollywood , Here's The Details - Filmibeat Telugu
/photos/feature/top-10-films-with-highest-pre-release-business-in-tollywood-heres-the-details-fb96194.html#photos-6
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ .. టాలీవుడ్‌కు ఆస్కార్ అవార్డ్‌ను తెచ్చిపెట్టింది. ఆర్ఆర్ఆర్ డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ కోసం విపరీతమైన పోటీ నెలకొనగా.. దాదాపు రూ.480 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.191 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. ఇప్పటి వరకు తెలుగు సినిమాలలో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఆర్ఆర్ఆర్‌కే.
8/10
Tollywood's Top 10 Business : టాలీవుడ్‌లో టాప్ 10 ప్రీ రిలీజ్ మూవీ బిజినెస్.. బాహుబలి టూ దేవర | Top 10 Films With Highest Pre Release Business In Tollywood , Here's The Details - Filmibeat Telugu
/photos/feature/top-10-films-with-highest-pre-release-business-in-tollywood-heres-the-details-fb96194.html#photos-7
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సాహోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దుమ్మరేపింది. సాహోకు ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ.333 కోట్ల వ్యాపారం జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నార్త్ ఇండియాలో ఏకంగా రూ.120 కోట్ల వ్యాపారం చేసి సాహో రికార్డ్ క్రియేట్ చేసింది
9/10
Tollywood's Top 10 Business : టాలీవుడ్‌లో టాప్ 10 ప్రీ రిలీజ్ మూవీ బిజినెస్.. బాహుబలి టూ దేవర | Top 10 Films With Highest Pre Release Business In Tollywood , Here's The Details - Filmibeat Telugu
/photos/feature/top-10-films-with-highest-pre-release-business-in-tollywood-heres-the-details-fb96194.html#photos-8
కేజీఎఫ్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.120 కోట్ల బిజినెస్ చేసిందని అంచనా.