bredcrumb

Vijay-Rashmika: విజయ్ దేవరకొండ కౌగిలిలో రష్మిక.. విరోష్ సంగీత్ ఫోటోలు వైరల్..

By Rajesh Karampoori
| Published: Tuesday, March 3, 2026, 11:14 [IST]

Vijay Deverakonda – Rashmika Mandanna Sangeet Night Photos: టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా ఈ జంట తమ సంగీత్ వేడుక ఫోటోలను షేర్ చేశారు.  విరోష్ సంగీత్ నైట్ ఫోటో గ్యాలరీని చూడండి.

Vijay Deverakonda – Rashmika Mandanna Sangeet Night Photos
1/8

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ సంగీత్ వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. పెళ్లి వేడుకలలో భాగంగా జరిగిన ఈ సంగీత్ నైట్ చాలా గ్రాండ్ గా జరిగింది. 

Vijay Deverakonda – Rashmika Mandanna Sangeet Night Photos
2/8

ఫోటోలలో విజయ్–రష్మిక ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. రష్మికను తన చేతుల్లోకి ఎత్తుకుని విజయ్ గిరగిరా తిప్పిన క్షణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఆనందంలో ఇద్దరూ పూర్తిగా మునిగిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

Vijay Deverakonda – Rashmika Mandanna Sangeet Night Photos
3/8

సంగీత్ నైట్ గురించి రష్మిక భావోద్వేగంగా రాస్తూ.. ‘ప్రేమ, ఆనందభాష్పాలు, నవ్వులు, సంగీతం, పాటలు, మెరుపులు… రాత్రంతా డ్యాన్స్ చేసిన అద్భుతమైన రాత్రి అది’అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల స్పీచులు, సర్‌ప్రైజ్‌లు తమ కళ్లలో ఆనందభాష్పాలు తెప్పించాయని తెలిపారు.

Vijay Deverakonda – Rashmika Mandanna Sangeet Night Photos
4/8

విజయ్ కూడా తన అనుభూతిని పంచుకుంటూ, ‘నవ్వుతూ కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వాం… కాళ్లు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేశాం’అని రాశారు. సంగీత్ నైట్ కేవలం ఒక వేడుక కాకుండా జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకమని చెప్పారు.

Vijay Deverakonda – Rashmika Mandanna Sangeet Night Photos
5/8

డిజైనర్ ఫాల్గునీ షానే పీకాక్ రూపొందించిన ప్రత్యేక దుస్తుల్లో ఈ జంట మెరిసిపోయింది. గ్లిట్టర్‌తో మెరిసే అవుట్‌ఫిట్స్ వేడుకకు మరింత గ్లామర్ తీసుకొచ్చాయి. దుస్తులు హెవీగా ఉన్నప్పటికీ రష్మిక రాత్రంతా డ్యాన్స్ చేయడం విశేషం.

Vijay Deverakonda – Rashmika Mandanna Sangeet Night Photos
6/8

కుటుంబ సభ్యులు, స్నేహితులు స్టేజ్‌పైకి వచ్చి ఫ్రీగా డ్యాన్స్ చేయడం ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చింది. ఇద్దరికీ సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్న కుటుంబ సభ్యులు అద్భుతంగా ప్రదర్శనలు ఇవ్వడంతో జంట ఆనందంతో మురిసిపోయింది.

Vijay Deverakonda – Rashmika Mandanna Sangeet Night Photos
7/8

సంగీత్ వేదిక కూడా రాజరికాన్ని తలపించేలా అలంకరించబడింది. లైటింగ్, పుష్పాల అలంకరణ, వింటేజ్ కార్ ఎంట్రీ అన్ని కలిపి ఆ రాత్రిని ఒక ఫెయిరీటేల్ వేడుకలా మలిచాయి.

Vijay Deverakonda – Rashmika Mandanna Sangeet Night Photos
8/8

ఈ సంగీత్ ఫోటోలు విజయ్–రష్మిక ప్రేమను, కుటుంబ బంధాలను, ఆనందాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అభిమానులు ‘విరోష్’ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మధుర క్షణాలను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+