అల్లు శిరీష్- నయనిక రెడ్డి పెళ్లి మార్చి 6వ తేదీన జరగనుండగా.. ఫిబ్రవరి 28వ తేదీన అల్లు అరవింద్ నివాసంలో అల్లు శిరీష్‌ను పెళ్లి కొడుకుని చేశారు. ఈ కార్యక్రమానికి కొత్త జంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నలు హాజరై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు


Click it and Unblock the Notifications
అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్- నయనిక రెడ్డిల వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా అల్లు శిరీష్‌ని పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమంలో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
అల్లు శిరీష్- నయనిక రెడ్డి పెళ్లి మార్చి 6వ తేదీన జరగనుండగా.. ఫిబ్రవరి 28వ తేదీన అల్లు అరవింద్ నివాసంలో అల్లు శిరీష్‌ను పెళ్లి కొడుకుని చేశారు. ఈ కార్యక్రమానికి కొత్త జంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నలు హాజరై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు
అల్లు శిరీష్ పెళ్లి వేడుకల్లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. గతంలో శిరీష్ నిశ్చితార్ధంతో పాటు ఇటీవల అల్లు అర్జున్ ఇచ్చిన స్పెషల్ పార్టీలోనూ పాల్గన్న ఆయన.. తాాజాగా శిరీష్‌ను పెళ్లి కొడుకుని చేసిన కార్యక్రమంలోనూ తన సతీమణి ఉపాసనతో కలిసి హాజరయ్యారు
అల్లు అరవింద్ కుటుంబానికి, నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ - అల్లు రామలింగయ్యల హయాం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే అనుబంధాన్ని బాలయ్య- అల్లు అరవింద్‌లు కొనసాగిస్తున్నారు. తాజాగా అల్లు శిరీష్‌ని పెళ్లి కొడుకుగా చేసే కార్యక్రమానికి బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవి హాజరయ్యారు
మెగా ఫ్యామిలీతో పాటు అల్లు కుటుంబంతోనూ సన్నిహితంగా ఉంటారు సాయిథరమ్ తేజ్. తాజాగా అల్లు శిరీష్‌ని పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమానికి సాయి హాజరయ్యారు.
నయనిక రెడ్డితో ప్రేమలో పడిన అల్లు శిరీష్ ఆమెతో కొన్నాళ్లపాటు ప్రేమాయణం సాగించారు. అనంతరం ఇరు కుటుంబాల అంగీకారంతో తాను నయనికను పెళ్లాడబోతున్నట్లు గతేడాది అల్లు శిరీష్ అధికారికంగా ప్రకటించారు. గతేడాది అక్టోబర్‌లో అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల పెళ్లి మార్చి 6వ తేదీన జరపనున్నట్లు వధూవరుల కుటుంబాలు అధికారికంగా ప్రకటించాయి. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డి దంపతుల పెళ్లి రోజు కూడా అదే రోజు కావడం విశేషం.
చాలారోజుల తర్వాత మెగా- అల్లు కుటుంబాలు అల్లు శిరీష్‌ని పెళ్లి కొడుకు చేసే కార్యక్రమంలో కలిశాయి. ఉదయం నుంచి శిరీష్‌కు మంగళ స్నానం చేయించడంతో పాటు ప్రతి కార్యక్రమంలోనూ రెండు కుటుంబాలు సరదాగా గడిపాయి.