bredcrumb

నా భర్త విజయ్‌ దేవరకొండ.. పెళ్లి ఫొటోలు పంచుకున్న రష్మిక మందన్న

By Rajesh Karampoori
| Updated: Friday, February 27, 2026, 08:40 [IST]

Vijay Deverakonda - Rashmika Mandanna wedding: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. విరోష్ వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

Vijay Deverakonda wedding
1/10

టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా హాట్ టాపిక్‌గా ఉన్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ప్రేమ కథకు చివరికి పెళ్లి ముహూర్తం కుదిరింది. గురువారం ఉదయం 10:10 గంటలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. విజయ్, రష్మిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెను జీవిత భాగస్వామిగా స్వీకరించడంతో ‘విరోష్’ జంట అధికారికంగా ఒక్కటైంది.

Vijay Deverakonda wedding
2/10

ఇద్దరి రిలేషన్‌షిప్‌పై చాలా కాలంగా ఊహాగానాలు వినిపించాయి. సినిమాల్లో కలిసి నటించినప్పటి నుంచి మొదలైన స్నేహం ప్రేమగా మారిందని అభిమానులు భావిస్తూ వచ్చారు. అయితే ఎప్పుడూ ఈ విషయంపై స్పష్టత ఇవ్వని ఈ జంట, ఇప్పుడు నేరుగా పెళ్లి ద్వారా అన్ని రూమర్లకు తెరదించింది. రష్మిక సోషల్ మీడియాలో “హాయ్ మై లవ్స్… నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా మిస్టర్ విజయ్ దేవరకొండ” అంటూ ఫొటోలు పంచుకోవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Vijay Deverakonda wedding
3/10

ఈ వివాహ వేడుక రెండు కుటుంబాల సంప్రదాయాల సమ్మేళనంగా జరిగింది. ఉదయం విజయ్ కుటుంబ ఆచారాల ప్రకారం హిందూ సంప్రదాయంలో పెళ్లి తంతు పూర్తయ్యింది. సాయంత్రం రష్మిక కుటుంబ పద్ధతిలో మరోసారి వివాహ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇలా రెండు సంస్కృతుల కలయికగా ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Vijay Deverakonda wedding
4/10

పెళ్లికి ముందు జరిగిన వేడుకలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. హల్దీ వేడుకలో ఈ జంట పసుపు రంగులో మెరిసిపోతూ కనిపించారు. అంతేకాదు, ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ పేరుతో నిర్వహించిన ఫన్ క్రికెట్ మ్యాచ్ కూడా అభిమానులను అలరించింది. #ViroshWedding హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది.

Vijay Deverakonda wedding
5/10

ఇక మార్చి 4న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. మొత్తంగా చెప్పాలంటే, టాలీవుడ్‌లో మరో స్టార్ జంట జీవితాంతం కలిసి నడవాలని నిర్ణయించుకోవడంతో అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ‘విరోష్’ లవ్ స్టోరీ ఇప్పుడు అధికారికంగా హ్యాపీ మ్యారేజ్ స్టోరీగా మారింది.  

virosh wedding pics
6/10

టాలీవుడ్‌లో రీల్ జోడీగా అభిమానుల హృదయాలు గెలుచుకున్న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇప్పుడు రియల్ లైఫ్‌లో భార్యాభర్తలుగా కొత్త జీవితం ప్రారంభించారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. చాలా కాలంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన వీరి ప్రేమకథకు అధికారిక ముగింపు పలుకుతూ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.

virosh wedding pics
7/10

ఉదయపూర్‌లో సంప్రదాయ తెలుగు, కొడవా ఆచారాలతో వివాహ వేడుకలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వేడుకలో సంప్రదాయ వేషధారణలో రష్మిక, విజయ్ అద్భుతంగా కనిపించారు. సాయంత్రం వేడుకలో రష్మిక తన అత్తగారు కానుకగా ఇచ్చిన ప్రత్యేక చీరలో మెరిసింది. పెళ్లి అనంతరం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం.

virosh wedding pics
8/10

ఈ సందర్భంగా రష్మిక మందన్న సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. “నేను కలలు కన్న మహిళగా మారాను… నా స్వప్నాలకు రెక్కలు ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు నా భర్త” అంటూ విజయ్‌పై తన ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తం చేసింది. తన స్వేచ్ఛను గౌరవించిన, తన ఎదుగుదలకు తోడుగా నిలిచిన వ్యక్తిగా విజయ్‌ను పరిచయం చేస్తూ భావోద్వేగంగా రాసిన ఆమె నోట్ అభిమానులను కదిలించింది.

virosh wedding pics
9/10

మరోవైపు విజయ్ దేవరకొండ కూడా తన హృదయాన్ని పంచుకున్నాడు. “ఒక రోజు ఆమె లేకపోవడం నాకు ఇంటి శాంతి లేకపోవడంలా అనిపించింది… నా బెస్ట్ ఫ్రెండ్‌ను నా భార్యగా మార్చుకున్నాను” అంటూ ప్రేమతో కూడిన సందేశం పోస్ట్ చేశాడు. 26.02.2026 తేదీని ప్రత్యేకంగా పేర్కొంటూ తన జీవితంలో ఈ రోజు ఎంతో ముఖ్యమని చెప్పాడు.

X