bredcrumb

Who is Ananya Birla: ట్రెండ్‌లోకి అనన్య బిర్లా.. ఎవరీ యంగ్ బిజినెస్ ఐకాన్?

By Rajesh Karampoori
| Published: Sunday, March 29, 2026, 15:17 [IST]

Who is Ananya Birla: ఐపీఎల్ గత సీజన్ ఛాంపియన్ ఆర్‌సీబీ ఈసారి కొత్త యాజమాన్యంతో బరిలోకి దిగుతుండగా, ఆర్యమాన్ బిర్లా ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరి అనన్య బిర్లా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. శ్రీమంతుల కుటుంబంలో పుట్టినా, వారసత్వంపై ఆధారపడకుండా తనదైన మార్గాన్ని ఎంచుకుంది అనన్య. గాయనిగా, సాంగ్ రైటర్‌గా, సామాజిక సేవకురాలిగా గుర్తింపు తెచ్చుకుని, తర్వాత తన తండ్రి కుమార్ మంగళం బిర్లా వ్యాపార రంగంలో అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమె యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ నేపథ్యంలో ఈ బిర్లా వారసురాలు తన గురించి  కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

Ananya Birla
1/9

Who is Ananya Birla: గత సీజన్ ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి కొత్త యాజమాన్యంతో బరిలోకి దిగుతోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం జట్టును కొనుగోలు చేయగా, ఆర్యమన్ బిర్లా ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరి అనన్య బిర్లా (Ananya Birla) పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దీంతో ఆమె ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? అనే విషయాలపై నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు.

Ananya Birla
2/9

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యం మారిన నేపథ్యంలో కొత్త పేర్లు వార్తల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆదిత్య బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ మార్పులతో ఆర్యమాన్ బిర్లా ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టగా, ఆయన సోదరి అనన్య బిర్లా పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మ్యాచ్‌ల సమయంలో స్టేడియంలో ఆమె కనిపిస్తే ఫ్యాన్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందనే చర్చ మొదలైంది.

Ananya Birla
3/9

అనన్య బిర్లా పేరు ఒక్కసారిగా వైరల్ కావడంతో “ఆమె ఎవరు?” అనే ప్రశ్న నెటిజన్లలో ఆసక్తి రేకెత్తిస్తోంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమార్తె అయినప్పటికీ, అనన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. కుటుంబ వారసత్వాన్ని మాత్రమే ఆధారంగా కాకుండా, స్వంతంగా ఎదగాలని చిన్న వయసులోనే నిర్ణయించుకుంది.

Ananya Birla
4/9

ముంబైలో జన్మించిన అనన్య, విద్యాభ్యాసాన్ని కూడా అత్యున్నత స్థాయిలో పూర్తి చేసింది. ఆమె ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్‌లో చదువుకుంది. చిన్నప్పటి నుంచే బిజినెస్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె, చదువుతో పాటు వ్యాపార దిశగా ముందడుగు వేసింది.

Ananya Birla
5/9

అత్యంత ఆశ్చర్యకర విషయం.. కేవలం 17 ఏళ్ల వయసులోనే అనన్య ‘స్వతంత్ర మైక్రోఫిన్’ అనే సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా గ్రామీణ మహిళలకు చిన్న రుణాలు అందిస్తూ, వారిని ఆర్థికంగా బలపడేలా చేస్తోంది. నేడు ఈ సంస్థ మొత్తం పెద్ద స్థాయిలో విస్తరించి, లక్షలాది మహిళలకు సహాయం చేస్తోంది.

Ananya Birla
6/9

వ్యాపార రంగంలోనే కాకుండా, అనన్య సంగీతంలో కూడా తన ప్రతిభను నిరూపించుకుంది. పాప్ సింగర్‌గా ఆమె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ‘సర్కిల్స్’, ‘బెటర్’ వంటి పాటలతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. అంతేకాకుండా, ఇంగ్లీష్ పాటకు ప్లాటినం సర్టిఫికేషన్ పొందిన తొలి భారతీయ గాయని అనే రికార్డును కూడా ఆమె సొంతం చేసుకుంది.

Ananya Birla
7/9

అనన్య బిర్లా ప్రస్తుతం పలు ప్రముఖ కంపెనీల డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా కొనసాగుతోంది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్ వంటి సంస్థలతో అనుబంధం ఉంది. వ్యాపార రంగంలో యువ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆమెకు మంచి గుర్తింపు ఉంది.

Ananya Birla
8/9

అనన్య బిర్లా నెట్‌వర్త్ విషయానికి వస్తే, వివిధ నివేదికల ప్రకారం రూ.1000 కోట్ల నుంచి రూ.1770 కోట్ల మధ్య అంచనా వేయబడింది. ముంబైలో సుమారు రూ.425 కోట్ల విలువైన ‘జాతియా హౌస్’ అనే విలాసవంతమైన నివాసంలో ఆమె ఉన్నట్లు సమాచారం. రోల్స్ రాయిస్, మెర్సిడెస్ మేబ్యాక్ వంటి లగ్జరీ కార్లతో ఆమె లైఫ్‌స్టైల్ అద్భుతమైన వార్తల్లో నిలుస్తోంది.

Ananya Birla
9/9

ఇక వ్యక్తిగతంగా కూడా అనన్య ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను ఎదుర్కొన్న ఆమె, అదే అనుభవంతో ‘ఎంపవర్’ అనే సంస్థను ప్రారంభించి, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తోంది. ఇప్పుడు RCB డీల్‌తో ఆమె పేరు మరింతగా ట్రెండ్ అవుతుండగా, వ్యాపారం, సంగీతం, సామాజిక సేవ-అన్నీ కలిపి అనన్య బిర్లా ఒక యంగ్ ఐకాన్‌గా ఎదిగినట్లు స్పష్టమవుతోంది.

X