X
అఖిల్

అఖిల్

Action | Romance | 11 Nov 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

అఖిల్ స్టోరీ

అఖిల్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అఖిల్ అక్కినేని, సయెష సైగల్,  రాజేంద్ర ప్రసాద్,  మహేష్ మంజ్రెకర్ బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సప్తగిరి, హేమ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి వి వినాయక్ నిర్వహించారు మరియు నిర్మాత నితిన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు అనూఫ్ రుబెన్స్, తమన్ ఎస్ కలిసి స్వరాలు సమకుర్చరు.  కథ సరదా కుర్రాడు అఖిల్ (అఖిల్ అఖినేని) మెడికల్ స్టూడెంట్ దివ్య (సాయేషా)తో ప్రేమలో పడతాడు. రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆమె కుటుంబాన్ని ఇంప్రెస్ చేస్తూంటాడు. ఇలా వీరి ప్రేమ కథ నడుస్తూండగా...ఆమె కిడ్నాప్ కు గురి అవుతుంది. ఆమెను వెతుక్కుంటూ ఉంటే ఆమె ఆఫ్రికాలో ఉందని తెలుస్తుంది. మరో ప్రక్క జర్మన్ సైంటిస్ట్ కత్రోచి...జువా ని తన గుప్పెట్లో పెట్టుకుని అతీత శక్తులతో ప్రపంచాన్ని ఏలాలని ప్రయత్నిస్తూంటాడు. ఇది తెలియని అఖిల్...దివ్యను వెనక్కి తేవటం కోసం బ్రహ్మానందంతో కలిసి కొందమంది ట్రైబర్ తెగ సాయిం తీసుకుని బయిలు దేరతాడు. వారితో కలిసి జర్నీ చేస్తున్న సమయంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవే అతని జీవితాన్ని, లక్ష్యాన్ని సమూలంగా మార్చేస్దాయి. ఆ సంఘటనలు ఏమిటి..జువాకు అఖిల్ కు సంభంధం ఏమిటి..అతను తన గర్ల్ ఫ్రెండ్ ని చేరుకున్నాడా, విలన్ నుంచి జువాని రక్షించి ప్రపంచాన్ని రక్షించాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

అఖిల్ కాస్ట్ & క్రూ

అఖిల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం వి వి వినాయక్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్, తమన్ యస్
నిర్మాత నితిన్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అఖిల్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇంతకాలం అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ క్లాస్ సినిమాలకే పరిమితం అవుతూ వస్తున్నారు...అప్పుడప్పుడూ మాస్ లుక్ కి ట్రై చేసినా ఆ దారిలో పూర్తి ప్రయాణం పెట్టుకోలేదు.కానీ అఖిల్ తొలి చిత్రం నుంచే మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రే చేసాడని అర్దమవుతోంది. తొలి చిత్రానికి దర్శకుడుగా ఏ గౌతమ్ మీనన్ నో, మణిరత్నం నో ఎన్నుకోకుండా మాస్ చిత్రాల దర్శకుడు వినాయిక్ ని ఎన్నుకోవటంలోనూ, డాన్స్ లు, ఫైట్స్ లో అఖిల్ అదరకొడుతున్న తీరులో అది మనకు స్పషమవుతుంది. ఇక ఇలాంటి కథలు తెలుగులో దేవిపుత్రుడు,అంజి అంటూ వచ్చాయి. అలాగే హాలీవుడ్ లో ఇండియానా జోన్స్, లారా క్రాప్ట్ టాంబ్ రైడర్ ఇంకా మరెన్నో చూసే ఉంటాం. అలాగే చాలా విజువల్స్ ఫిరానా, అవతార్ లను గుర్తు చేస్తే హెలీకాప్టర్ సీక్వెన్స్, వల్కనో బరస్ట్ అవటం వంటివి పూర్తిగా హాలీవుడ్ సినిమాల నుంచి తీసుకున్నవే అని అర్దమవుతూ ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం తెలుగులో నడుస్తున్న ట్రెండ్ ని ఢిఫెర్ చేసే కొత్త కథే...అయితే ట్రీట్ మెంట్, స్క్రీన్ ప్లే విషయంలో దాన్ని పరమ రొటీన్ గా మార్చేసారు.

అఖిల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అఖిల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+