»   » మరో సారి ఆలోచంచండి: పవన్ కు ఫ్యాన్స్ రిప్రజంటేషన్

మరో సారి ఆలోచంచండి: పవన్ కు ఫ్యాన్స్ రిప్రజంటేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో స్ట్రాంగ్ గా ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో ఒకరు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు ఆ ఫ్యాన్స్ చాలా వర్రీ అవుతున్నారని సమాచారం. ఓ ప్రక్క పవన్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ..పెద్ద ఫ్లాఫ్ చిత్రంగా నమోదు చేస్తూండగా... మరో ప్రక్క పవన్ ...తనకు సినిమాలంటే ఆసక్తి లేనట్లుగా స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే పవన్ ఈ నెల 29 నుంచి ఎస్ జె సూర్య దర్సకత్వంలో ఓ చిత్రం ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఓ ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీగా దాన్ని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం విన్న పవన్ ఫ్యాన్స్ మరింత కంగారు వచ్చిందని మీడియాలో చెప్పుకుంటున్నారు. ఎందుకంటే గతంలో పవన్ కి ఎస్ జె సూర్య..కొమరం పులి వంటి అతి పెద్ద డిజాస్టర్ చిత్రం ఇచ్చారు.

అంతేకాకుండా ఆయన తమిళంలో చేసిన సినిమాలు కూడా ఏమీ ఆడలేదు. దాంతో వారు కంగారు పడుతున్నారని, పవన్ కు ఈ విషయమై ఓ రిప్రజంటేషన్ ఇచ్చారని సమాచారం. ఎస్ జె సూర్యతో పనిచేయటం కన్నా త్రివిక్రమ్ చేస్తే మంచి క్వాలిటీ అవుట్ ఫుట్ వస్తుందని, డెషిషన్ మరోసారి ఆలోచించి తీసుకోమని ఆ రిప్రజెంటేషన్ లో ఉన్నట్లు వినపడుతోంది. మరి పవన్ ఏమంటారో చూడాలి. ఆయన సాధారణంగా తన అభిమానుల మాటకు విలువ ఇస్తూనే ఉంటారు.

Is it True?: Pawan Fans send representation

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. మొన్న శుక్రవారం రిలీజైన ఈ చిత్రం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ప్రీమియర్ షోలు ఓపెన్ అయ్యాయి. అంతేకాదు మహేష్ ..శ్రీమంతుడు చిత్రం ప్రీమియర్ షో రికార్డ్ లను సైతం బ్రద్దలు కొట్టింది.

బాహుబలి తర్వాత అమెరికాలో రెండో అతి పెద్ద ఓపెనర్ తెలుగు చిత్రంగా నమోదు అయ్యింది. ఇవన్నీ ఫ్యాన్స్ కు , సినీ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చే అంశాలే.అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఓవర్ సీస్ లో పూర్తి కలెక్షన్స్ పడిపోయినట్లు సమాచారం. పెట్టిన పెట్టుబడి వెనక్కి సగం కూడా తిరిగిరాదని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు.

బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శరత్‌ మరార్‌, సునీల్‌ లుల్లా, పవన్‌కల్యాణ్‌ సంయుక్తంగా నిర్మించారు. పవర్‌స్టార్‌తో కాజల్‌ తొలిసారి జోడీ కట్టింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు.. 2012లో విడుదలైన సంచలన విజయం సాధించిన 'గబ్బర్‌ సింగ్‌' చిత్రానికి ఫ్రాఛైజ్ గా ఈ చిత్రం తెరకెక్కింది.

English summary
Senior Pawan Kalyan fans have reportedly sent representations to Pawan Kalyan, to reconsider his decision and work with either Trivikram or some promising director who can ensure a quality film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu