»   » ఎనాలసిస్ :పవన్ కు హీరోయిన్స్ సెంటిమెంట్... నిజమేనా?

ఎనాలసిస్ :పవన్ కు హీరోయిన్స్ సెంటిమెంట్... నిజమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ అనేవి సర్వ సాధారణం అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టు ఓపెన్ చేసేటప్పుడు, గతంలో పరాజయం ఎదుర్కొన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకు కారణంగా ఇది కోట్ల తో జరిగే వ్యాపారం అని చెప్తూంటారు. కానీ ఇండస్ట్రీలో అందరూ అలాగే సెంటిమెంట్స్ ని నమ్ముతూంటారా...

అయితే పవన్ కళ్యాణ్ వంటి కొంతమంది పోగ్రసివ్ ధాట్ ఉన్న హీరోలు, నిర్మాతలు నమ్మరని చెప్తూంటారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ రూమర్..వేగంగా ప్రయాణిస్తోంది. అది పవన్ సైతం సెంటిమెంట్స్ ని ఫాలో అవుతున్నాడని. నిజమా ఉత్తిదా అనేది ప్రక్కన పెడితే పవన్ ఫాలో అవుతున్న సెంటిమెంట్ ఏమిటన్నది ఎప్పుడూ ఆసక్తికరమే.

ఇండస్ట్రీలో చెప్పుకునే దాని ప్రకారం..పవన్ ..ప్రస్తుతం తన ప్రక్కన నటించే హీరోయిన్స్ విషయంలో సెంటిమెంట్స్ ని ఫాలో అవుతున్నట్లు చెప్తున్నారు. ముంబై నుంచి తీసుకు వస్తున్న హీరోయిన్స్ కలిసి రావటం లేదని,తన కెరీర్ లో పెద్ద డిజాస్టర్స్ అన్నీ నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్స్ తో నే అనే సెంటిమెంట్ ని నమ్ముతున్నట్లు చెప్తున్నారు.

అందుకే ఆయన తను తాజాగా ఎస్ జె సూర్య తో చేయటానికి సిద్దమవుతున్న చిత్రంలో హీరోయిన్ గా మళయాళి ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు నిర్మాత ,దర్శకుడుకు ఆయన పురమాయించినట్లు చెప్తున్నారు. ఇప్పటికే పవన్ ..మళాయళి హీరోయిన్స్ చాలా చూసారని, చూస్తున్నారని, త్వరలో వారిని కొందరిని ఎంపిక చేసి తమ ఆఫీసుకు పిలిపించే అవకాసం ఉందిట.

అసలు పవన్ చేసిన చిత్రాలు, అందులో హీరోయిన్స్ ని చూస్తే ప్రచారం అవుతున్న సెంటిమెంట్ రూమర్ లో ఎంత నిజముందో తెలుస్తుంది కదా..అందుకే ఆయన చేసిన చిత్రాలు, హీరోయిన్స్ గురించి క్రింద స్లైడ్ షోలో చర్చిస్తున్నాం...ఎంజాయ్ ఇట్...

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలి చిత్రంమైన ఈ చిత్రాన్ని ఇవివి సత్యనారాయణ డైరక్ట్ చేసారు. ఇందులో నాగార్జున మేనకోడలు సుప్రియ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా ఆడలేదు. సుప్రియ దక్షిణాది అమ్మాయే.

గోకులంలో సీత

గోకులంలో సీత

పవన్ కెరీర్ లో హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి అగస్త్యన్ డైరక్టర్, రాశి హీరోయిన్ గా చేసింది. రాశి దక్షిణాది అమ్మాయే.

సుస్వాగతం

సుస్వాగతం

పవన్ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన సుస్వాగతం చిత్రానికి భీమినేని దర్శకుడు. తమిళ నుంచి వచ్చిన దేవయాని హీరోయన్.

తొలి ప్రేమ

తొలి ప్రేమ

పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా చేసింది. ఆమె కూడా దక్షిణాది హీరోయిన్.

తమ్ముడు

తమ్ముడు

పవన్ కెరీర్ మరో బ్లాక్ బస్టర్ తమ్ముడు. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రీతి జింగానియా హీరోయిన్ గా చేసింది. ఆమె నార్త్ నుంచి వచ్చింది.

బద్రి

బద్రి

పవన్ కెరీర్ లో మంచి హిట్ చిత్రం బద్రి. పూరి దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రంలో అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్స్ గా చేసారు. వీళ్లిద్దరూ నార్త్ నుంచి వచ్చినవారే.

ఖుషీ

ఖుషీ

పవన్ కెరీర్ లో అతి పెద్ద హిట్ ఖుషీ చిత్రం. ఈ చిత్రంలో చేసిన భూమికా ఛావ్లా. పంజాబి. అంటే నార్త్ నుంచివచ్చినట్లే కదా.

జానీ

జానీ

పవన్ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచిన జాని చిత్రంలో రేణుదేశాయ్ హీరోయిన్ గా చేసింది. ఆమె పూనే వాసి.

గుడుంబా శంకర్

గుడుంబా శంకర్

వీర శంకర్ దర్శకత్వంలో రూపొందిన గుడుంబాశంకర్ లో మీరాజాస్మిన్ హీరోయిన్ గా చేసింది. మీరా జాస్మిన్ ..మళయాళి. ఈ చిత్రం జస్ట్ ఓకే అనిపించుకుంది.

బాలు

బాలు

కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన బాలు చిత్రంలో శ్రేయ, నేహా ఒబరాయ్ హీరోయిన్స్ గా చేసారు. ఈ చిత్రం డిజాస్టర్. ఇద్దరు హీరోయిన్స్ నార్త్ నుంచి వచ్చినవారే.

బంగారం

బంగారం

తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిజాస్టర్. ఈ చిత్రంలో మీరాచోప్రా హీరోయన్ గా చేసింది. ఆమె ప్రియాంక చోప్రా కజిన్. ముంబై నుంచి వచ్చింది.

అన్నవరం

అన్నవరం

భీమినేని దర్శకత్వంలో రూపొందిన అన్నవరం చిత్రం కూడా పెద్దగా ఆడలేదు. ఈ సినిమాలో అసిన్ హీరోయిన్ గా చేసింది. ఆమె మళయాళి.

జల్సా

జల్సా

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా చిత్రం బాగా ఆడింది. ఇలియానా హీరోయిన్ గా చేసంది. ఆమె గోవా నుంచి వచ్చింది.

కొమురం పులి

కొమురం పులి

పవన్, ఎస్ జె సూర్య కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం డిజాస్టర్. ఈ చిత్రంలో నిఖిషా పటేల్ హీరోయిన్ గా చేసింది. ఆమె గుజరాతి.

తీన్ మార్

తీన్ మార్

పవన్, జయంత్ పరాంన్జీ కాంబినేషన్ లో రూపొందిన తీన్ మార్ చిత్రం యావరేజ్ అనిపించుకుంది. త్రిష..తమళం నుంచి వచ్చింది.

పంజా

పంజా

పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో అంజలి లావన్య, సారా జాన్ హీరోయిన్స్ గా చేసారు. వీళ్లిద్దరూ నార్త్ నుంచి వచ్చారు.

గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గాచేసింది. ఆమె తమిళియన్.

కెమెరామెన్ గంగతో రాంబాబు

కెమెరామెన్ గంగతో రాంబాబు

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. తమన్నా నార్త్ నుంచి వచ్చింది.

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రణీత, సమంత హీరోయిన్స్ గా చేసారు. వీళ్లిద్దరూ దక్షిణాది నుంచి వచ్చిన వారే.

గోపాల గోపాల

గోపాల గోపాల

పవన్, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన గోపాల గోపాల చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ లేదు.

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్

రీసెంట్ గా బాబి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన కాజల్ అగర్వాల్ నార్త్ నుంచి వచ్చింది.

English summary
Pawan wants to rope someone from Malayalam industry for his next untitled film under SJ Surya direction.So rumours are spreading wide in industry that Pawan is also trapped in heroine sentiment mills.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu