twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ పార్టీ తో జూ. ఎన్టీఆర్ కు పెద్ద దెబ్బ

    By Srikanya
    |

    హైదరాబాద్ : తన తాతగారు స్ధాపించిన తెలుగుదేశం పార్టీకి ప్రచారంకి ఎన్టీఆర్ వెళ్ళటానికి ఆసక్తి చూపిస్తున్నాడనే సంగతి తెలిసిందే. రాజకీయంగా ఏక్టివ్ గా లేకున్నా పార్టీ ప్రచారానికి ఆయన వెళ్లతారని చెప్తున్నారు. అయితే పవన్ పార్టీ ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్న నేపధ్యంలో ఎన్టీఆర్ వర్రీ అవుతున్నారని అంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఇంతకు ముందు తెలుగుదేశంకు స్టార్ ఎట్రాక్షన్ ఇప్పుడు పవన్ ముందు అది ఎంతవరకూ నిలబడుతుంది...పవన్ వచ్చి ప్రచారం చేస్తూంటే తనకు ప్రయారిటీ ఏమిటని తన వాళ్లతో అంటున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

    మరో ప్రక్క మహేష్ బావ గల్లా జయదేవ్ రీసెంట్ గా తెలుగు దేశంలో జాయిన్ అయ్యారు. గల్లా జయదేవ్ గుంటూర్ ప్రాతం నుంచి ఎంపి అభ్యర్దిగా నిలబడబోతున్నారు. అలాగే మరో ప్రక్క కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు సైతం తెలుగు దేశం నుంచి తెనాలి నియోజక వర్గం నుంచి నిలబడుతున్నారు. దాంతో వీరిద్దరి ప్రచార భాధ్యత మహేష్ పై పడింది. ఇప్పటికే వీరికి ప్రచారం చేస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం.

    NTR anxious about Pawan’s TDP entry

    అలాగే ఎన్టీఆర్ ఇప్పటిగే తెలుగుదేశం ప్రచారం నిమిత్తం ఇరవై రోజులు పాటు సమయం కేటాయించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తెలుగు దేశంకు రెండు వైపులా ప్రచారం చేయనున్నారు. దీనికి తోడు ఎలాగో లెజండ్ తో సిద్దమవుతున్న బాలకృష్ణ సైతం టీడీపి ప్రచారానికి తనదైన శైలిలో సిద్దమవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇంకా చాలా మంది ఈ పొలిటికల్ క్యాంపైన్స్ లో పాల్గొంటున్నా మహేష్, ఎన్టీఆర్ పాల్గొని ప్రచారం చేయటం మాత్రం పార్టీకి బాగా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

    ఇక రానున్న ఎన్నికల్లో బాలకృష్ణ పోటీచేస్తారా అన్న విలేకర్ల ప్రశ్నకు బాబు స్పందిస్తూ.. ఆయన పోటీచేస్తానంటే ఎమ్మెల్యే/ఎంపీ టికెట్‌ ఇస్తామని తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అభిమానులు అడుగుతున్నారు కదా? అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ''అభిమానుల గురించి నేను మాట్లాడడం లేదు. రేపు ఎవరో వచ్చి నీక్కూడా అధ్యక్ష పదవి ఇవ్వాలని అడగొచ్చు. తెలుగుజాతిని ఈ క్లిష్ట పరిస్థితుల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది'' అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎవరెవరిని ఎలా గౌరవించాలో అలా గౌరవించేందుకు సిద్దంగా ఉందన్నారు. పార్టీలోకి మంచివాళ్లనే చేర్చుకుంటున్నామని, ఎవరొచ్చినా కార్యకర్తలకు తొలి గౌరవం ఉంటుందని చెప్పారు.

    English summary
    
 
 And now, it's being heard that TDP is making grounds to get closer to Pawan Kalyan's Jana Sena to woo votes in Seemandra. If that's the case, then NTR Jr will not going to be the star attraction anymore for TDP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X